Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రవేటీకరణ దిశగా ఎయిరిండియా…

ప్రవేటీకరణ దిశగా ఎయిరిండియా…
-ఇప్పటికే బిడ్లు దాఖలు చేసిన సంస్థలు
-ప్రైవేటీకరించకపోవడం అనే సమస్యే లేదు
-సంస్థకు రోజుకు రూ.20 వేల కోట్ల నష్టం
-సంస్థ పేరు మీద రూ.60 వేల కోట్ల రుణాలు
-పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కీలక వ్యాఖ్యలు
ఎయిర్ ఇండియా పౌరవిమానయన సంస్థను ప్రవేటీకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే బిడ్లను కూడా ఆహ్వానించింది. సంస్థకు రోజుకు 20 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అందువల్ల ప్రవేటీకి అప్పగించటం లేదా మూసివేయడం అనే రెండు మార్గాలు కేంద్రం ముందున్నాయని -పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కీలక వ్యాఖ్యానించారు.సంస్ఠపేరుమీద ఇప్పటికి 60 కోట్ల రుణాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రైవేటీకరించకపోవడం అన్న ప్రత్యామ్నాయమే కేంద్రం ముందు లేదన్నారు.

ఎయిరిండియా ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్‌ల ప్రక్రియ పూర్తయ్యేందుకు 64 రోజుల సమయం పడుతుందని శుక్రవారం హర్దీప్‌ తెలిపారు. మే నెలాఖరుకు పూర్తికావచ్చని అంచనా వేశారు. ఆ తర్వాతే ఎయిరిండియా ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది తెలుస్తుందన్నారు. మరోవైపు ఎయిరిండియా కోసం ఆల్‌ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతో కలిసి స్పైస్‌జెట్‌ యజమాని అజయ్‌సింగ్‌, ఢిల్లీకి చెందిన బర్డ్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ అంకుర్‌ భాటియా, టాటా సన్స్‌ బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం.

Related posts

తైవాన్ ను కుదిపేసిన భారీ భూకంపం

Drukpadam

రాఘురామ వైద్య పరీక్షల రిపోర్ట్ స్పెషల్ మెసెంజర్ ద్వారా హైకోర్టు కు…

Drukpadam

ముందు రాజధాని ఎక్కడో నిర్ణయించనివ్వండి.. ఆ తర్వాత చూద్దాం: ఏపీలో కార్యాలయ ఏర్పాటుపై ఆర్‌బీఐ

Drukpadam

Leave a Comment