Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సు పెంపుపై ఆగ్రహం

ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సు పెంపుపై ఆగ్రహం
-మహబూబాబాద్ జిల్లాలో యువకుడు ఆత్మహత్యాయత్నం
-రిటైర్ మెంట్ పెంపు తనకు అవసరం లేదన్న ఉపాధ్యాయిడు
-పీఆర్సీ ఫిట్ మెంట్ పై ఉద్యోగుల్లోనూ అసంతృప్తి
-నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని ఆందోళన


తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వటంతో పాటు రిటైర్మెంట్ యవస్సు పెంచింది. రిటైర్మెంట్ యవస్సు పెంపు ఉద్యోగులు అడిగింది కాదు . శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 60 సంవత్సరాలకు పెంచుతామని వాగ్దానం చేసింది. దీంతో కేసీఆర్ వాళ్ళు 60 అనటంతో మేము ఇంకొక సంవత్సరం అధికంగా 61 సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ అన్నారు గానీ ఉద్యోగులకు మాత్రం, ఆ పెంచుతారా ? పెంచినా ఒకటే పెంచకపోయిన ఇబ్బంది లేదు . చాలామంది కాంట్రాక్టు వర్కర్స్ ఉన్నారు వారిని పర్మినెంట్ చేస్తే మంచిది . అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు పెంచితే మంచిది వాళ్ళు కూడా మాతో పాటె ఉద్యోగం చేస్తూ చాల తక్కువ వేతనం పొందుతున్నారు, అనే అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. పెంచినా 60 సంవత్సరాలకు పెంచుతారేమోననే అభిప్రాయాలతో ఉన్నారు. ఉద్యోగులు కోరుకున్నది వయోపరిమితి కాదు , పీఆర్సీ ఇతర బెనిఫిట్స్. పీఆర్సీ కమిటీ సిఫార్స్ చేసిన ఫిట్మెంట్ 7 .5 ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఇచ్చింది 30 శాతం . దీనిలో మరో తీరకాసు ఏమిటంటే 2018 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ 2021 ఏప్రిల్ నుంచి అమలు చేయటం . అంటే ప్రభుత్వ ఉద్యోగులు మూడు సంవత్సరాల ఫిట్మెంట్ పోగొట్టుకోవటం . అసలు బిస్వాల్ కమిటీ 7 .5 ఎందుకు సిఫార్స్ చేసింది. దానికి ఉన్న శాస్త్రీయత ఏమిటి ? ప్రభుత్వం చెప్పిందని చేసిందా ? లేక తమ సొంత ఆలోచనా, అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా ఉంది. రాష్ట్ర ఆదాయ వనరులమీద ఆధారపడి వేతనాల పెంపు అనేది ఉండదు. నిజంగా బిస్వాల్ కమిటీ ముందు శాస్త్రీయంగా వేతన పెంపుకు సిఫార్స్ చేసి ఉద్యోగులను సంప్రదించి వారికీ ఎంత మేరకు తగ్గించవచ్చునో అడగాల్సింది. కానీ ఆలా జరగలేదు. ఉద్యోగ సంఘాలు బిస్వాల్ కమిటీ ని కలిసి వారు ఆశిస్తున్నా పీఆర్సీ పై ,వివరించారు. వివరమైన నివేదికలు ఇచ్చారు. కానీ వారి సిఫారసులను పట్టించుకోలేదు. అడగని వయోపరిమితి పెంపు తమ వాగ్దానం మేరకు చేస్తున్నామని 61 సంవత్సరాలకు పెంచుతూ ప్రకటన చేశారు. ఇది ఉద్యోగుల కే ఇష్టం లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. రిటైర్మెంట్ వయస్సును పెంచటంపై నిరుద్యోగ యువకుల్లో తీవ్ర అగ్రావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగులు అడగకుండానే వారికీ వయోపరిమితి పెంచటం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ సర్కారుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. యూనివర్సిటీ కేంద్రాలలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి . నిరుద్యోగుల ఆగ్రహావేశాలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ కు చెందిన బోడ సునీల్ అనే ఒక విద్యార్ధి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లోని క్రీడా మైదానంలో పురుగుల మందు తగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు . కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగానియమాకాలు చేపట్టలేదని తాను గత 7 సంవత్సరాలుగా ఉద్యోగామ్ కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం రాలేదని ఆత్మహత్యాప్రయత్నం చేసుకున్నాడు. నేను చేతకాక చనిపోవాలని అనుకోవటం లేదని నేను చచ్చిపోతేనన్న అందరికి జాబులు వస్తాయనే ఉద్దేశంతో ఇలా చేశానని నేను బతికొస్తే మీతో కలిసి పోరాటం చేస్తా లేక పొతే పోరాటాన్ని మీరు కొనసాగించడాన్ని సూసైడ్ నోట్ లో సునీల్ పేర్కొన్నారు. దీనిపై నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. ఇవేమి చర్యలు ,ఇవేమి చేష్టలు అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ జె ఏ సి దీనిపై ఆందోళనకు సిద్దమౌతుండగా ప్రజల్లోనూ దీనిపై తీవ్ర వ్యతేరేకత వ్యక్తం అవుతుంది. కొంతమంది ఉద్యోగులు తమకు వయోపరిమితి పెంపు అవసరంలేదని ప్రకటిస్తుండటం విశేషం . ఒక పోలీస్ అధికారి వయోపరిమితి పెంపుపై మాట్లాడుతూ నిజంగా ఉద్యోగులకు 55 సంవత్సరాలు చాలని 58 సంవత్సరాలే ఎక్కువ అనుకుంటే మరో మూడు సంవత్సరాలు పెంచటం సరికాదన్నారు. ఉద్యోగంలో ఉన్న ఓకే స్కూల్ హెడ్ మాస్టర్ తనకు వయోపరిమితి పెంపు అవసరంలేదని తాను 58 సంవత్సరాలకే రిటైర్ మెంట్ తీసుకుంటానని అన్నారు.

Related posts

ఈవీఎం బ్యాలెట్ పత్రంలో చిన్నగా సీతక్క ఫొటో.. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద అర్ధరాత్రి ధర్నా

Ram Narayana

రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు…

Drukpadam

మహారాష్ట్రలో భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు!

Drukpadam

Leave a Comment