మాస్క్ ధరించని ట్రాఫిక్ సీఐ.. జరిమానా విధించాలన్న ఎస్పీ

  • గుంటూరు లాడ్జి, ఎంబీటీ కూడలిలో స్పెషల్ డ్రైవ్
  • సీఐకి స్వయంగా మాస్క్ తొడిగిన ఎస్పీ
  • వాహనదారులకు హితబోధ
SP Ammireddy fined to Traffic CI Mallikarjuna Rao for not wearing mask

మాస్క్ ధరించకుండా కంటపడిన తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా విధించి స్వయంగా మాస్కు తొడిగారు. మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై నిన్న గుంటూరు లాడ్జి, ఎంబీటీ కూడలిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. అదే సమయంలో మాస్క్ ధరించకుండా అటుగా వెళ్తున్న ట్రాఫిక్ సీఐ మల్లికార్జున రావును చూసిన ఎస్పీ పిలిచి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు.

అర్జెంటుగా వెళ్తూ మర్చిపోయినట్టు సీఐ చెప్పారు. వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సీఐకి సూచించారు. మాస్క్ ధరించని సీఐకి జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. అనంతరం మాస్క్ తెప్పించి సీఐకి స్వయంగా తొడిగారు. అలాగే వాహనదారులను ఆపి మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు.

Leave a Reply

%d bloggers like this: