Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగుదేశం 40 సంవత్సరాల ప్రస్థానం…

తెలుగుదేశం 40 సంవత్సరాల ప్రస్థానం
-ఎన్టీఆర్ ఆవేశంలో నుంచి పుట్టిన పార్టీ
-రాజకీయాల్లో ఒక విప్లవం సృష్టించిన ఎన్టీఆర్
-పేదల కోసం తపించిన ఎన్టీఆర్
-బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఎన్టీఆర్
-పాలనలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మహానుభాహుడు
-పటేల్ ,పట్వారి వ్యవస్థ రద్దు , మండలాల ఏర్పాటు

తెలుగుదేశం ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తీ అయింది. 40 సంవత్సరాల వేడుకలను ఆపార్టీ జరుపుకుంటుంది. ఈ 40 ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో విజయాలు ,మరెన్నో అపజయాలు ,1982 తెలుగుదేశం పుట్టింది . చంద్రబాబు అన్నట్లు నిజంగా ఇది ఎన్టీఆర్ ఆవేశంలో నుంచి పుట్టిన పార్టీనే . కాని నేడు దాని ఆదర్శాలు,సిద్ధాంతాలు పక్కదార్లు పట్టాయి. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశమే ఒక సంచలనంగా మారింది . ఆయన మరణించిన తీరు జుగుస్సాకరం. ఎన్టీఆర్ చరిష్మా ప్రజలను కదిలించింది. ఆయన ప్రచార రధం వెంట ప్రజలు పరుగులు తీశారు. ఎన్టీఆర్ రాజకీయాలలో అడుగు పెట్టె నాటికీ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత ప్రజల్లో గూడు కట్టుకొని ఉంది. కాంగ్రెస్ పార్టీ మాటిమాటికి ముఖ్యమంత్రులను మార్చడం ,అవినీతి రాజకీయాల పై తెలుగు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అప్పటికే ప్రతిపక్షాల ఆధ్వరంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సరిగ్గా ఆసమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించటం రాష్ట్రంలో రాజకీయ మార్పుకు కారణమైంది. కాంగ్రెస్ గుత్తాది పత్యాన్ని బద్దలు కొట్టారు . రాష్ట్రం అంత ప్రచారం రధం పై 75 వేల కి .మీ తిరిగి కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు. ఆయన తన సహజ శైలిలో చేసిన ఉపన్యాసాలు ,ప్రజలను ఉర్రుతలు ఊగించాయి. కుక్కమూతి పిందలు, తెలుగువాడి ఆత్మగౌరం , లాంటి డైలాగులు ప్రతి గుండెను తాకాయి.రూ. 2 లకే కి .లో బియ్యం ,పక్క ఇంటి పధకం లాంటి ప్రజాకర్షక పథకాలుగా మారాయి. ఆయన లో ఒక రాముడిని ఒక కృష్ణుడిని ప్రజలు చూసుకున్నారు. ఓట్ల వర్షం కురిపించారు.ఫలితంగా 1983 శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం సునామి సృష్టించింది. అయితే కొద్దీ కాలానికే ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురైయ్యారు. ఎన్టీఆర్ బైపాస్ సర్జరికోసం అమెరికా వెళ్ళాడు .అదునుగా భావించిన కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది . పార్టీ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించిన నాదెళ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రం లో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని గవర్నర్ రాంలాల్ ద్వారా కాంగ్రెస్ ఈ పనికి పూనుకుంది .దీనిపై ప్రజాగ్రహం పెల్లుబికింది. పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది . ఈ ఉద్యమం లెఫ్ట్ ,రైట్ పార్టీలు పార్టీలు పాల్గొన్నాయి. చివరకు ఈ ఉద్యమానికి కేంద్రం తలవంచక తప్పలేదు. గవర్నర్ ను మార్చటమే కాకుండా తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేయక తప్పలేదు. తరువాత ఎన్టీఆర్ రాజీనామా చేసి 1985 ప్రజాతీర్పును కోరాడు .ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. మొత్తం 294 తెలుగుదేశం మిత్రపక్షాలకు 230 సీట్లు వచ్చాయి. పరిపాలనలో ఎన్టీఆర్ తన మార్క్ పాలనా అందించారు. విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. పటేల్ ,పట్వారి వ్యవస్థను రద్దుచేశారు.మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1989 జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎన్టీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి కల్వకుర్తిలో ఓడిపోవడం.తెలుగుదేశం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇది రాజకీయ పండితులను సైతం ఆశ్చర్య పరిచిన సంఘటన . కేంద్రానికి వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలను కూడగట్టంలో కాంక్లివ్ లను నిర్వహించటంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రతిపక్షాల ఐక్య సంఘటన నేషనల్ ఫ్రంట్ కు చైర్మన్ గా వ్యవహరించి దేశవ్యాపితంగా పర్యటించారు. ఒక సందర్బాల్లో దేశ ప్రధాని ఎన్టీఆర్ అవుతారని అనుకున్నారు.1994 ఎన్నికలలో తిరిగి ఏదికారంలోకి వచ్చారు. తరువాత తెలుగుదేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు , లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ వివాహం ఆడటం తెలుగు దేశంలో చీలికలు , వైస్రాయి హోటల్ సంఘటనలు , ఎన్టీఆర్ పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి మారడం ,మామకు వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు పై అపవాదు ఉన్నాయి.తరువాత కాలంలో తెలుగుదేశాన్ని చంద్రబాబే ఎక్కువకాలం నడిపారు. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో ఐదు సంవత్సరాలు తెలంగాణ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు ఎప్పుడు ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్లి గెలిచిన సందర్భం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో డబ్బు ప్రధానపాత్ర పోషించటం తెలుగుదేశం దీనికి అతీతం కాకపోవడం రాజకీయాల్లో అవినీతి ,పక్షపాత ధోరణులు ,అక్రమాలు పెరిగాయి. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పేరు ఉన్న ఆయన సిద్ధాంతం పక్కదార్లు పట్టింది. పొత్తులేకుండా చంద్రబాబు ఒంటరిగా గెలవడనే ప్రచారం ఉంది .అది అనేక సందర్భాలలో నిరూపితం అయింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయటం దుర్లభంగా మారింది.కుళ్ళు ,కుతంత్రాలు , ఈర్ష ,ద్యేషాలు నేటి రాజకీయాల్లో సాధారణమైపోయాయి . ఇవి వేవి ఎన్టీఆర్ కోరుకోలేదు.

Related posts

పార్లమెంట్ భవనం ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవడంలేదు …కమల్ హాసన్ ..

Drukpadam

రఘురామకు పౌరుషం ఉంటే ఈటల లాగా రాజీనామా చేయాలి: మార్గాని భరత్…

Drukpadam

2024 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ చెమటలు పట్టిస్తుంది: ప్రశాంత్ కిశోర్

Drukpadam

Leave a Comment