Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బెంగాల్‌లో మాత్రం దీదీదే హవా: ప్రశాంత్‌ కిశోర్‌

  • బెంగాల్‌ తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్‌ కిశోర్‌
  • తృణమూల్‌ విజయం తథ్యమని ధీమా
  • బీజేపీపై ఎస్సీలకు నమ్మకం పోయిదని వ్యాఖ్య
  • బీజేపీ రెండంకెల సీట్లు దాటడం కష్టమన్న ఎన్నికల వ్యూహకర్త
Prashanth kishor is confident on TMC Victory in Bengal

తాజాగా ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌ రాజకీయ పరిస్థితిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుపునకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రముఖ పత్రిక ‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా  ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాచుర్యం ఉన్నప్పటికీ..  బెంగాల్‌లో మాత్రం దీదీకే తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మమత, మోదీల మధ్య పోరాటంగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రెండంకెల స్థానాలు దాటడం కష్టమని అంచనా వేశారు. ఒకవేళ తన అంచనాలు తప్పితే..  రాజకీయాలకు పూర్తిగా దూరమవుతానని పునరుద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గుచూపినప్పటికీ.. ఇక్కడి ఎస్సీ ఓటర్లు.. ఈసారి తృణమూల్‌కే ఓటేస్తారని ధీమాగా చెప్పారు.

తాజాగా జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. గత 30-35 ఏళ్ల కాలంలో బెంగాల్‌లో అధికార పార్టీని.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీ ఢీకొన్న సందర్భాలు లేవని తెలిపారు. బీజేపీ ఈ ఎన్నికల్లో కులం ఆధారంగా ఓట్లు సంపాదించేందుకు యత్నిస్తోందని తెలిపారు. అయితే, బెంగాల్‌లో కూడా కులం కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అక్కడి ప్రజలు కాస్త భిన్నంగా వ్యవహరిస్తారని తెలిపారు.

తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు తలపడుతున్నాయని తెలిపారు. అదే బెంగాల్‌లో ఓ జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలు బెంగాల్‌పై ఎక్కువ దృష్టి సారించారన్నారు. గత ఏడాది నవంబర్-డిసెంబరులో బీజేపీకి అనుకూలంగా చాలా ఊహాగానాలు తెరమీదకు వచ్చాయని తెలిపారు. 200 సీట్లు సాధిస్తారని ప్రచారం జరిగిందన్నారు. అయితే, డిసెంబర్‌లో నిజంగానే బీజేపీ 200 సీట్లు సాధించే స్థితిలో ఉండేదని తెలిపారు. ఆ అంచనాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. ఇప్పుడు వారు రెండంకెల సీట్లకే పరిమితమవుతారని ధీమాగా చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని దృష్టిలో ఉంచుకొని గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎస్సీలు, నమశూద్రులు, మాతువా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మూకుమ్మడిగా బీజేపీకి ఓటేశారని ప్రశాంత్‌ కిశోర్‌ తెలిపారు.  అయితే, ఆ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో బీజేపీపై ఈ వర్గాలకు నమ్మకం పోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని.. అదే వారిపై నమ్మకం పోయిందనడానికి నిదర్శనమన్నారు.

ఇక ప్రభుత్వం వ్యతిరేక ఓటును సాధ్యమైనంతవరకు తగ్గించే ప్రయత్నం చేశామని ప్రశాంత్‌ కిశోర్ ‌ తెలిపారు. ‘బ్లాక్ ప్రెసిడెంట్లలో దాదాపు 60 శాతం మంది ఇప్పుడు కొత్తవారని, అలాగే 80 మందికి పైగా ఎమ్మెల్యేలను తొలగించి కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చామని తెలిపారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తగ్గిపోతుందని ఆశిస్తున్నామన్నారు.

Related posts

కాంగ్రెస్ లోకి రమ్మంటున్నారు.. వెళ్లేది లేదు!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

Drukpadam

సోము వీర్రాజుకు ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సీపీఐ నారాయణ!

Drukpadam

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ…

Drukpadam

Leave a Comment