Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గిరిజనులపై దాడికి పాల్పడ్డ ఫారెస్ట్ అధికారులపై చర్యలకు డిమాండ్ …సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా

సమావేశంలో మాట్లాడుతున్న నున్నా

గిరిజనులపై దాడికి పాల్పడ్డ ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి అటవీ హక్కుల చట్టం ద్వారా పోడుసాగుదారులకు హక్కు పత్రాలు వెంటనే అందించాలి

గిరిజనులపై దాడికిపాల్పడ్డఫారెస్ట్అధికారులపైచర్యలకు సిపిఎం ఖమ్మంజిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 2 గ్రామాల నుండి 3 రోజుల క్రితం అడవిలో రాలిన విప్పపూల సేకరణకు వెళ్ళిన గిరిజనులపై 20 మంది 50 సం.లు పైబడిన వారిపై ఫారెస్ట్ అధికారులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారని, వారి పైన దాడికి పాల్పడ్డ ఫారెస్ట్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ, గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా పొట్ట గడుపుకుంటారని, యిది భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు అని అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవిలోకి వెళ్ళిన గిరిజనుల పై పాశవికంగా దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. గత కొంతకాలంగా గిరిజనులపై దాడులు పెరగటం, పోడు భూములు, అటవీ భూముల్లో దీర్ఘకాలం నుండి సేద్యం చేసుకొంటున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా వారికి హక్కులు కల్పించాల్సిందిపోయి, తాత తండ్రుల నుండి అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులపై దాడులు చేయడం సర్వ సాధారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూముల సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తానని అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ మరో ప్రక్క ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై దాడులు చేస్తుండటం గిరిజనులను మోసం చేయటమే అని అన్నారు. అటవీ భూముల నుండి గిరిజనులను పారద్రోలడానికి పులులను వదిలి పెట్టారనే ప్రచారం కూడా జరుగుతుందన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనుల పై జరిగే దాడులను ఆపాలని ఆయన కోరారు

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో జిల్లావ్యాప్తంగా నిరంతరం పోడు సాగుచేస్తున్న గిరిజన పేదలపై అటవీశాఖాధికారులు దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులుతో పాటు భూముల్లో పొక్లైన్లు, యంత్రాలతో కందకాలు తీసి భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా పార్లమెంట్లో సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాసే విధంగా చర్యలకు పాల్పడటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అన్నారు. తక్షణం అటవీశాఖ, రెవెన్యూ, గిరిజన శాఖ సమన్వయంతో పోడు భూముల సర్వే నిర్వహించి తక్షణమే పట్టాలు, హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. కౌలు, పోడు రైతులకు కూడా రైతుబంధు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో గత 7 సం.ల నుండి డిమాండ్ చేస్తుంటే, పోదు, కౌలు రైతుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవడంతో ముఖ్యమంత్రి రైతుబంధు అందజేస్తానని ప్రకటించారు. దీనిని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి యర్రా శ్రీకాంత్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, జిల్లాకమిటి సభ్యులు వై.విక్రం శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, కౌండబోయిన నాగేశ్వరరా రంపూడి పాండురంగారావు టి.లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం జిల్లాలో 35వేల దొంగఓట్లు..కేంద్ర ఎన్నికల సంఘానికి తుమ్మల ఫిర్యాదు…

Ram Narayana

హైద్రాబాద్ లో బీజేపీ ,టీఆర్ యస్ మధ్య పోస్టర్ల యుద్ధం ….

Drukpadam

Apple MacBook Air Vs. Microsoft Surface Laptop

Drukpadam

Leave a Comment