Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ లకు రాహుల్ ఫోన్ …సాగర్ పై ఆరా ?

రాష్ట్ర ఎంపీ లకు రాహుల్ ఫోన్ …సాగర్ పై ఆరా ?
-రాష్ట్రంలో రాహుల్ సభ పెట్టె ఆవకాశం
-సాగర్ లో ప్రచారం పై పార్టీ హైకమాండ్ ద్రుష్టి
-జానారెడ్డి గెలుపుకు పట్టుదలతో పని చేయాలని ఆదేశం
-ఉత్తమ్ ,కోమటిరెడ్డి లు ప్రత్యేక భాద్యతలు తీసుకుంటున్నారా ?
రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారా ? సాగర్ పై ఆరా తీశారా ? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు . తెలంగాణాలో జరుగుతున్నా నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . దీనితో ఇక్కడ జానారెడ్డి తదైనా శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు సార్లు నియోజకవర్గంలోని ప్రముఖులను కలిశారు. వారి మద్దతు కోరారు. సాగర్ ఎన్నికపై రాహుల్ కూడా రాష్ట్రంలోని ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్ రాష్ట్ర రాజకీయాలపై ఎప్పటికప్పుడు నాయకులతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది . రాష్టంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద బహిరంగసభ పెట్టె యోచనలో ఉన్నాడని దానికి రాహుల్ హాజరుకానున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో వరస ఎదురు దెబ్బలు తగులుతున్న సందర్భంలో సాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవటం ద్వారా 2023 ఎన్నికలకు టీఆర్ యస్ కు తామే ప్రత్యాన్మాయం అని చాటి చెప్పాలని గట్టిపట్టుదలతో ఉంది. దీంతో పార్టీ హైకమాండ్ ద్రుష్టి సారించింది. నిరంతరం ఇక్కడ జరుగుతున్నా ప్రచారంపై ఆరాతీస్తోంది . సీనియర్ నేత జానారెడ్డి పోటీకి ముందు సుముఖంగా లేరని హైకమాండ్ నచ్చచెప్పటంతో రంగంలోకి దిగారని వార్తలు వచ్చాయి. జానారెడ్డి కాకుండా ఎవరు పోటీచేసిన అక్కడ ప్రయోజం ఉండదని భావించిన పార్టీ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి అన్నిటిని హైకమాండ్ ప్రత్యేకంగా పర్వవేక్షేస్తుంది . ఇక్కడ నాయకులకు కూడా సాగర్ లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆదేశాలు జారీచేసింది.అందువల్ల పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా మొన్న జరిగిన హాలియా సభకు హాజరై జానారెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాలలో మలుపు కావాలని పిలుపు నిచ్చారు. ఈ సభకు ఒక్క రేవంత్ రెడ్డి మినహా రాష్ట్ర ప్రధాన నాయకత్వం రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉత్తమ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ పార్లమెంట్ పరిధిలో నాగార్జున సాగర్ ఉంది. కోమటి రెడ్డి అభిమానులు కూడా ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. దీనితో ఈ ఇద్దరు నేతలు ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తీ అయింది. టీఆర్ యస్ తన అభ్యర్థిగా దివగంత నోముల నరసింహయ్య కుమారుడు భగత్ ను ఎంపిక చేశారు. అందువల్ల టీఆర్ యస్ సానుభూతిపై ఆధారపడగా , బీజేపీ గిరిజన ఓట్లను టార్గట్ గా ఆ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి డాక్టర్ రవి కుమార్ ను బరిలోకి దింపింది. దీంతో పోటీ హోరా హోరీగా సాగె ఆవకాశం ఉంది. తెలుగుదేశం ,ఇతర అభ్యర్థులు రంగంలో ఉన్న పోటీ మాత్రం పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యనే ఉంటుందనేది నిర్వివాద అంశం . కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రచారం ప్రారంభించింది . ఇక్కడ జానారెడ్డి , రవికుమార్ స్థానికులు కాగా నోముల భగత్ బయట వారు అయితే ఆయన కూడా గత ఎన్నికల్లో తన తండ్రి తరుపున ఇక్కడ తిరిగారు . టికెట్ రాకముందే నియోజవర్గంలో ప్రముఖులను కలిశారు. రవికుమార్ కాంగ్రెస్ పార్టీ తరుపున జడ్పీటీసీ గా పోటీ చేశారు. ప్రచారంలో మూడు పార్టీలు నామినేషన్ల అనంతరం దూసుకు పోతాయని అనటంలో ఎలాంటి సందేహంలేదు. ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణిస్తారో చూడాలి !!!

Related posts

ఏపీలో వలంటీర్ కు ఉన్న అధికారం ఎమ్మెల్యేకి కూడా లేదు: ఎమ్మెల్యే ఆనం

Drukpadam

దళితబందు డబ్బు ఇస్తాం…బట్ కండిషన్స్ అప్లై…

Drukpadam

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కొండా సురేఖకు దక్కని చోటు!

Drukpadam

Leave a Comment