Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు నిర్ణయంపై తమ్ముళ్ల తిరుగుబాటు…

చంద్రబాబు  నిర్ణయంపై తమ్ముళ్ల తిరుగుబాటు…
-ఎన్నికల్లో పోటీ చేయక పోవడం తెల్ల జెండా ఎత్తటమే నంటున్న తమ్ముళ్లు
-పార్టీలో గందరగోళం
-అనేక చోట్ల సీనియర్ల ప్రచారం
-పోటీచేయకపోయిన ప్రచారం చేస్తామన్న బాబు
-ఇదేమి నిర్ణయం అంటున్న పలువు నేతలు
ఏపీలో జరుగుతున్నా జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేయరాదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై తమ్ముళ్లు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇది పార్టీలో గందరగోళానికి దారితీసింది. జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికలు ప్రకటించగానే పార్టీ సమావేశం పెట్టిన చంద్రబాబు ఎన్నికల్లో పాల్గొనేలా వద్ద అనేదానిపై తర్జనభర్జనలు పడ్డారు .చివరకు నిర్ణయాన్ని అధినేత బాబుకే వదిలేస్తున్నట్లు నిర్ణయం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి తాము జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొనటం లేదని చెప్పారు.కాని సీన్ రివర్స్ అయింది.ఆయనకు అధికారం కట్టబెట్టిన తమ్ముళ్లే ఎదురు తిరిగారు. ఇది సరైన నిర్ణయం కాదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా తెల్ల జెండా ఎట్టటంపై భగ్గుమన్నారు. పార్టీ నిర్ణయం వాళ్ళ పార్టీ గందరగోళానికి గురైందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఇదేనా అంటూ తెలుగు తమ్ముళ్లే అనడం ఆపార్టీ అధినేత మానసిక స్థితిని తెలియజేస్తుందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఎన్నిక ఏదైనా ఓడినా,గెలిచినా , ప్రజల్లో ఉండాలి కాని ఇలా చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కు చెందిన పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రు తనపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయానికి నిరసనగానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాని నియోజకవర్గానికి ఇంచార్జి గా కొనసాగుతానని తెలిపారు. సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు అశోకగజపతి రాజు విజయనగరం జిల్లాలో తెలుగు దేశం వారితో నామినేషన్ లు వేయించటమై కాకుండా వారి తరుపున ప్రచారమా కూడా నిర్వవిస్తున్నారు.విశాఖలో బండారు సత్యనారాయణ మూర్తి ప్రచారంలో పాల్గొంటున్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో పోటీచేసి తీరుతామని తమ్ముళ్లు అధినేతకు తెగేసి చెప్పారు. పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తామని అనంతపురం కల్యాణ దుర్గం ఇంచార్జి హనుమంతరాయ చౌదరి తెలిపారు. అనేక జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొనడంతో చంద్రబాబు స్వరం మారింది .పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న చోట్లా ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. మొత్తానికి టీడీపీ నిర్ణయం పార్టీలో గందరగోళానికి దారితీయడం పై సీనియర్లు తలలు పట్టుకొంటున్నారు.

Related posts

చంద్రబాబు తో గ్యాప్ వచ్చినమాట నిజం … గంటా

Drukpadam

ఫారెస్ట్ అధికారి బలికి ప్రభుత్వ వైఫల్యమే కారణం:సీఎల్పీ నేత భట్టి !

Drukpadam

ఆసక్తికరం.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్రానికి కేటీఆర్ లేఖ!

Drukpadam

Leave a Comment