Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగర్ ఎన్నిక కులాల సమరంగా మారుతుందా… ?

సాగర్ ఎన్నిక  కులాల సమరంగా మారుతుందా… ?
-రెడ్ల ఓట్లపై కాంగ్రెస్
-యాదవ్ ల ఓట్ల కోసం టీఆర్ యస్
-ఎస్టీ లంబాడా ఓట్ల కోసం బీజేపీ
-కులాలవారీగా భాద్యతలు అప్పగింత
ఈ నెల 17 న ఉపఎన్నిక జరగనున్న నాగార్జున సాగర్ లో పోరు ఆశక్తి కరంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం 41 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. వీరిలో ప్రధాన పోటీ టీఆర్ యస్ , కాంగ్రెస్, బీజేపీ ల మధ్యనే ఉంది. ఈ సారి ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కులాల ప్రాతిపదికన ఓట్ల రాబట్టుకునే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. అందువల్ల ఈ ఎన్నిక పార్టీల కన్నా కులాల సమరంగా మారబోతుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు మూడు బలమైన కులాలకు చెందిన అభ్యర్థులనే రంగంలోకి దించాయి. అందువల్ల కులాల వారీగా ఇంచార్జిలను నియమించి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తన అభ్యర్థి రవికుమార్ ప్రచారం కోసం మాజీ ఐఏఎస్ ,ఐ పి ఎస్ గ్రూప్ వన్ అధికారులను రంగంలోకి దించబోతుంది. కాంగ్రెస్ తరుపున 17 మంది ఇంచార్జిలను నిమించగా వారిలో 7 గురు రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక యాదవ అభ్యర్థిని తమ పార్టీ తరుపున పెట్టిన టీఆర్ యస్ సెంటిమెంట్ తో పాటు యాదవ కులం నియోజకవర్గంలో బలమైనదిగా ఉన్నందున ఆ కులం ఓట్లపై కేంద్రీకరించింది. సాగర్ నియోజకవర్గంలో ఎక్కడ విన్న కులాల వారీగా ఉన్న ఓట్లు పైనే చర్చ జరుగుతుంది. బీజేపీ అభ్యర్థి రవినాయక్ తమ కులం వారి దగ్గరకు వెళ్లి తనకు డబ్బు, పోరాడే శక్తి లేదని కంట తడి పెట్టడం పలువురిని కదిలించింది. ఈ మూడు కులాలకు చెందిన ఓట్లు 40 వేల చొప్పున ఉంటాయని అయితే గంపగుత్తగా కులం ఓట్లన్నీ కులం అభ్యర్థికే పడతాయా ? లేదా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణాలో కులాల ప్రభావం పెద్దగా పనిచేయదని ఇప్పటి వరకు ఉన్న నమ్మకం . అయితే కొంత ప్రభావం తప్పకుండ ఉంటుందని పార్టీల వారు సైతం అంగీకరిస్తున్నా మాట .టీఆర్ యస్ ,కాంగ్రెస్ పార్టీలు పకడ్బందీగా ప్రచారం చేస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ , స్థానిక ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడే మకాం వేసి మొత్తం ప్రచారాన్ని పర్వవేక్షణ చేస్తున్నారు. జానారెడ్డి ఇద్దరు కుమారులు ప్రతి మండలంలో తిరుగుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ నియోజవర్గం లో మంచి మైజార్టీ వచ్చింది. ప్రతి గ్రామంలో పోలింగ్ స్టేషన్ ల వారీగా వచ్చిన ఓట్ల ఆధారంగా మైనస్ ,ప్లస్ లు లెక్కలు వేస్తున్నారు. టీఆర్ యస్ నుంచి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , మంత్రులు ఉదృతంగా ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కోసం అటు టీఆర్ యస్ ,ఇటు కాంగ్రెస్ లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై నిత్యం పోరాడుతున్న కమ్యూనిస్టులకు టీఆర్ యస్ కు మద్దతు ఇవ్వటం ఇప్పట్లో కుదరని పని అందువల్ల వారు జానారెడ్డికి మద్దతు ఇచ్చే ఆవకాశం ఉంది. కొత్తగా రంగంలోకి దిగిన టీఆర్ యస్ ,బీజేపీ అభ్యర్థులను ప్రజలు ఆదరిస్తారో లేక రాజకీయ కురువృద్ధుడు జానారెడ్డి వైపు మొగ్గుతారో చూడాలి మరి !!!

Related posts

దేవుడి పథకాలు వేరేగా ఉంటాయి.. బ్రదర్ అనిల్ కుమార్!

Drukpadam

హరీశ్ రావ్! గుండె మీద చేయి వేసుకుని చెప్పు: ఈటల రాజేందర్ :ఈటలది మొసలి కన్నీరు: హరీశ్ రావు…

Drukpadam

వ్యవస్థలను మేనేజ్ చేయగలరు , ప్రజలను చేయలేరు: చంద్రబాబుపై బొత్స వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment