Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగర్ ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

సాగర్ ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం
-కాంగ్రెస్ గెలిస్తే జనాకు తిరుగుండదు
-పార్టీలో ఆయన మాటే వేదంగా మారుతుంది.
-కాంగ్రెస్ నుంచి బయటకు పోదామనుకున్న వారు ఆలోచనలో పడతారు
-టీఆర్ యస్ గెలిస్తే టీఆర్ శ్రేణుల్లో ఆనందం
-2023 తిరిగి తమదే అధికారం అని టీఆర్ యస్ ప్రచారం చేసుకుంటుంది
-బీజేపీ గెలిస్తే 2023 లో తామే అధికారంలోకి వస్తామనే ప్రచారం ఊపందుకుంటుంది
-వివిధ పార్టీల నుంచి నేతలు బీజేపీ లో చేరేందుకు క్యూ కడతారు

నాగార్జున సాగర్ లో జరుగుతున్న ఉపఎన్నిక చిన్నదే ఒక నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయ భవిషత్ ను శాసించబోతుంది. వరస ఎదురు దెబ్బలతో బలహీన పడుతున్న అధికార టీఆర్ యస్ ఈ ఎన్నిక అత్యంత కీలకం . గత ఎన్నికల్లో ఇక్కడ నుచి అధికార టీఆర్ యస్ అభ్యర్థి నోముల నరసింహయ్య విజయం సాధించారు. అంతకు ముందు రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచినా కుందూరు జానారెడ్డి ఓడిపోయారు. సహజంగా అభ్యర్థి ఏపార్టీ వారైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చి వారిని ఏకగ్రీవం చేయటం అనేది జరిగేది. ఇప్పుడు కొన్ని పార్టీలు అంగీకరించటం లేదు అందువల్ల పోటీ అనివార్యంగా మారింది. ఒక నియోజకవర్గంలో గెలిచినా ఓడినా ఒరిగేది ఏమీలేదనే అభిప్రాయాలూ పోయాయి. అన్ని పార్టీలు రంగంలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. గెలిస్తే దాని ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడుతుంది. అందువల్ల 41 మంది రంగంలో ఉన్న నాలుగు పార్టీలు కాంగ్రెస్ ,టీఆర్ యస్ , బీజేపీ ,టీడీపీ లు ఉన్నాయి. ఈ నాలుగు పార్టీలలో కూడా తెలుగుదేశం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు . మిగతా మూడు పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి విషయంలో చివరిదాకా నిర్ణయం తీసుకోలేకపోయింది. అప్పటికే టీఆర్ యస్ ,కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. పైగా జనరల్ సీటులో ఎస్టీ లంబాడాకు బీజేపీ టికెట్ ఇచ్చింది .అందువల్ల టీఆర్ యస్ ,కాంగ్రెస్ నువ్వా నేనా అనేవిధంగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలంతా సాగర్ లోనే మకాం వేశారు. జానారెడ్డికి మద్దతుగా స్థానిక పార్లమెంట్ సభ్యుడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షబ్బీర్ అలీ ,జీవన్ రెడ్డి , అంజన్ కుమార్ యాదవ్ , రామిరెడ్డి దామోదర్ రెడ్డి లు ప్రచారంలో పాల్గొంటున్నారు. జానారెడ్డి తనయులు ఇద్దరు మొత్తం ప్రచారం భాద్యతలు తీసుకున్నారు. గెలుపు ఎవరిదీ అనేది చెప్పటం కష్టమనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ యస్ నుంచి మంత్రులు మహమూద్ అలీ,శ్రీనివాస్ యాదవ్ , జగదీష్ రెడ్డి , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రచారం చేస్తున్నారు. మండలానికి ఒక మంత్రికి భాద్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి , కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మంత్రి కేటీఆర్ , ప్రచారానికి రానున్నారని టీఆర్ యస్ వర్గాలు చెబుతున్నాయి. గడప గడపకు ప్రచారం జరుగుతుంది. ఓట్లర్లు ఎవరికీ ఓటువేయాలనేది నిర్ణయించుకున్న బయటకు చెప్పటం లేదు . మూడు పార్టీల మధ్య విజయం దోబుచులాడుతుందా ముందుగానే ఓటర్ నాడి పసిగట్టే అవకాశం ఉందా అనే దానిపై కొన్ని సంస్థలు పని చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ,కాకతీయ విద్యార్థులు వచ్చి ప్రజల నాడి తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ ,బీజేపీ ,టీఆర్ యస్ లు ఈ ఎన్నికను చాల సీరియస్ గా తీసుకొని ప్రచారం చేస్తున్నాయి. ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడో చూడాలి మరి !!!

Related posts

ఇన్నాళ్లూ పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా?: సజ్జల

Drukpadam

సిలిండర్ ధర పెంపుపై భగ్గుమన్న బీఆర్ యస్.. నిరసనలకు పిలుపు ..

Drukpadam

జగన్ బెయిల్ రద్దు … చంద్రబాబు జైలుకే…

Drukpadam

Leave a Comment