Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో లాక్ డౌన్,కర్ఫ్యూ ఉండదుగాక ఉండదు-మంత్రి ఈటెల

రాష్ట్రంలో లాక్ డౌన్,కర్ఫ్యూ ఉండదుగాక ఉండదు-మంత్రి ఈటెల
-కరోనా పరిస్థితులపై మంత్రి సమీక్ష
– ముఖ్యమంత్రి కరోనా పై నిరంతరం ఆదేశాలు ఇస్తున్నారు.
-మందుల , బెడ్స్ కొరత లేదు
-భయపడాల్సిన పనిలేదు
-మహారాష్ట్ర నుంచే అధికకేసులు
రాష్ట్రంలో కరోనా సెకండ్ వెవ్ ఉన్నప్పటికీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్ర స్పష్టం చేశారు. కరోనా ఉన్నదనే ఉద్దేశంతో లాక్ డౌన్,కర్ఫ్యూ ఉండదుగాక ఉండదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పై నిరంతరం ఎప్పటికప్పుడు సరైన ఆదేశాలు ఇస్తున్నారని అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్న టర్శరే కేర్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఏర్పాట్లు పై సమీక్ష నిర్వహించిన మంత్రి కరోనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసికోవాలని అన్నారు. అందుకు అధికార యంత్రంగం, ప్రజలను చెతన్య పరచాలని పేర్కొన్నారు. దేశంలో 60 శాతం కేసులు మహారాష్ట్ర నుండే నమోదు అవుతున్నాయి. లక్షణాలు లేకుండా కూడా చాలా కేసులు ఉన్నాయన్నారు .రాపిడ్ టెస్ట్స్ అందుబాటులో కి వచ్చిన తరువాత ట్రేసింగ్ వేగవంతం అయ్యిందన్నారు. దీంతో మరణాల శాతం తగ్గిందన్నారు . 56 వేల మందికి రోజుకు వాక్సిన్ ఇస్తున్నాం.. భవిష్యత్తు లో 1.5 లక్షల మందికి ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నాం.పరీక్షలు అవసరం అయితే రోజుకి లక్ష మందికి చేస్తాం. అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు కొనసాగిస్తూనే కరోనా సేవలు కూడా అందిస్తామన్నారు . వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది లీవ్ లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటున్నారని అలాంటి సేవలను అభినందించారు. 33 జిల్లాల్లో ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు . అన్ని జిల్లా కేంద్రాల్లో కోవిద్ చికిత్స అందుబాటులో ఉందని అన్నారు . మహారాష్ట్ర తో పాటు వివిధ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల వారందరు అప్రమత్తంగా ఉండాలన్నారు . 11 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు .ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు ఉన్నాయని ప్రజలు వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లు వ్యాపార కోణంలో చూడవడ్డు సేవ చేయండి, లక్షల రూపాయలు వసూలు చేయవద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. . కరోనా పేషంట్ వస్థే వారి బంధువులు భయపడకుండా వచ్చి పలకరించి పోతున్నారు. భయపడకండి కాని జాగ్రత్తలు పాటించండి. కరోనా ఒక మామూలు రోగం. వాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంది . హోమ్ ఇసొలేషన్ పేషంట్ కి కిట్స్ అందిస్తాము.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో డాక్టర్ ఇంటికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుకుంటారు.ఏ మాత్రం అనుమానం ఉన్న పరీక్షలు చేసుకోండి.సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తున్నారు. అవసరం అయిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

Related posts

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టు విచారణ ప్రారంభం…

Drukpadam

టీటీడీలో బ్రాహ్మ‌ణ వ్య‌తిరేక శ‌క్తులు ఉన్నాయి: ర‌మ‌ణ దీక్షితులు

Drukpadam

మూడు నెలల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీ భామ!

Drukpadam

Leave a Comment