Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల ఖమ్మం సంకల్ప సభ లో పార్టీ పేరు వెల్లడి…

షర్మిల ఖమ్మం సంకల్ప సభ లో పార్టీ పేరు వెల్లడి
-తెలంగాణాలో రాజన్న రాజ్యం
-షర్మిల పార్టీ జెండా ,ఎజెండా ఏవిధంగా ఉండబోతుంది
-సభకు షరతులతో కూడిన పోలీస్ పర్మిషన్
-కోవిద్ నిబంధనలు పాటించాల్సిందే
-నిబంధనల ప్రకారమే సభ జరుపుతామన్న నిర్వాకులు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టబోతున్నారు. ఖమ్మం వేదికగా తన పార్టీ పేరును ప్రకటిస్తారని నిర్వాకులు ప్రకటించారు. .ఇప్పటికే పార్టీ పేరు జెండా, ఎజెండాపై ఒక నిర్ణయానికి వచ్చినందున ఖమ్మం లో జరగనున్న సంకల్ప సభలో ఆమె ప్రకటించనున్నారు. ఆమె పార్టీ పేరు ,జెండా పై అభిమానుల్లో ఆశక్తి నెలకొన్నది . పార్టీపేరు రాజన్న పేరు కలసి వేచేలా పెట్టాలని ,లేదు తెలంగాణ కాంగ్రెస్ గా పెట్టాలనే అభిప్రాయాలూ వచ్చాయని ఏదైనా రాజన్న అనే పదం అందులో ఉండేలా ప్రకటించనున్నారు. జెండాలో తెలుపు ,పసుపు , గ్రీన్ ఉండే విధంగా రూపొందించినట్లు తెలుస్తుంది. అనేక మంది ప్రముఖులు షర్మిల పార్టీ లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొండా రాఘవరెడ్డి , కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కళాకారుడు ఏపూరి సోమన్న షర్మిల చేరారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరశోభ మరికొందరు చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరంజిత్ సేన్ ,ఆయన భార్య ,షర్మిల పార్టీలో చేరబోతున్నారు. అజారుద్దీన్ కుమారుడు , సానియా మీర్జా చెల్లెలు , మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి తదితరులు ,చేరే వారిలో ఉన్నట్లు సమాచారం. గతంలో మధిర నుంచి పోటీచేసిన హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అంజాన్ రాజు కూడా షర్మిల టీంలో చేరారు. తెలంగాణలోని పాత పదిజిల్లాలకు గాను 9 జిల్లాలకు సంబంధించి వైయస్ అభిమానులతో గత నెలరోజులుగా సమావేశాలు నిర్వనించారు. వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. వివిధ జిల్లాలలోని సమస్యలపై ఒక అవగాహనకు వచ్చారు. జిల్లాల సమావేశాల సందర్భంగా కూడా ఆమె ఆయాజిల్లాల ప్రాముఖ్యత అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ప్రస్తావించి వాటిని ప్రస్తావించటం ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
—————————————————————————-
ఖమ్మం సభకు షరతులతో కూడిన పర్మిషన్
ఎన్ని ఆటంకాలు ఉన్న సభ పెట్టి తీరుతాం … కొండా రాఘవరెడ్డి
కేసీఆర్ సభకు కరోనా నిభందనలు వర్తించవా ?
సాగర్ ఎన్నికల్లో సభలు ఎందుకు పెడుతున్నారు.
—————————————————————————-


ఈనెల 9 న షర్మిల ఖమ్మం సభ కు పోలీసులు కోవిద్ కారణంగా షరతులతో కూడిన అనుమితి ఇచ్చారు. ముందు ప్రభుత్వ కళాశాల మైదానంలో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వించాలని అనుకున్న కోవిద్ మహమ్మారి తిరిగి విజృభించటంతో పరిమితమైన జనసమీకరణతో సభకు అనుమతి ఇచ్చారు. అందువల్ల ముందు అనుకున్నట్లు సభ ప్రభుత్వ కళాశాల మైదానం కాకుండా పెవిలియన్ గ్రౌండ్ కు మార్చారు. దీనితో కేవలం 5 నుంచి 6 వేలమందితో మాత్రమే సభ పెట్టాలని పోలీసులు షరతు విధించారు. పోలిసుల షరతులకు లోబడి సభ నిర్వవిస్తామని సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యనేత కొండా రాఘవరెడ్డి చెప్పారు. ఆయన ఖమ్మం లో వేర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లడుతూ కరోనా ఉన్నందున అభిమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సభకు వచ్చే వారికోసం శానిటైజ్ చేయటం తో పాటు మాస్క్ లు కూడా పెట్టెకోవాలని ప్రచారం చేస్తున్నామని తెలిపారు.
ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు ఖమ్మంలో మకాం వేసి పెవిలియన్‌గ్రౌండ్‌లో నిర్వహించే సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మండలాలు, నియోజకవర్గాలవారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమవుతూ భారీగా జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. 9న జరిగే బహిరంగసభలో షర్మిల తన పార్టీ పేరు, జెండా, ఎన్నికల గుర్తు, సిద్ధాంతాలను ప్రకటించనున్నారు . లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సమాయత్తమవుతుండగా.. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసిన పోలీసుయంత్రాంగం.. ఆరు వేల మందికే పరిమితం చేస్తూ అనుమతిచ్చింది. ఇదు క్రమంలో కొవిడ్‌ నిబంధనలు అనుసరించి సభ పెట్టుకోవాలంటూ సెక్షన్‌ 68, 69 కింద నోటీసు జారీచేసింది. ఖమ్మం జిల్లాలో కొవిడ్‌ కేసులు లేవని, అయినా కావాలనే ఆటంకాలు కలిపిస్తున్నారంటూ సభ నిర్వాకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖా చెబుతున్న లెక్కలను ఆయనకు వివరించి సభకు అనుమతి తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈనెల 9న ఖమ్మంలో నిర్వహించబోయే వైఎస్‌ షర్మిల సంకల్ప సభ జరిగి తీరుతుందని‌ కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మంలో మంత్రుల పర్యటనకు సభలు పెట్టుకున్నప్పుడు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో సభకు లేని కరోనా, షర్మిల సభకు మాత్రమే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఇటీవల నిర్వహించిన జిల్లాల సమ్మేళనంలో పోడుభూములు, పత్తి, పసుపు రైతులతోపాటు తాగు, సాగునీటి సమస్యలు, ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేక ప్రజలు పడుతున్న అవస్థలు షర్మిలకు చెప్పుకొన్నారని, తెలంగాణలో మళ్లీ వైఎస్‌ పాలన చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జిల్లాల సమ్మేళనంలో ఆ ప్రజాభిప్రాయం స్పష్టంగా తెలిసిందన్నారు. ఖమ్మం మెట్టులోనే తొలిసభ నిర్వహిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకం పెద్దఎత్తున షర్మిలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారన్నారు. తెలంగాణలో కొత్త  ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్నకు జాతీయపార్టీగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు గంపకింద కమ్మేశారని.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన పట్ల తెలంగాణ ప్రజలకు మక్కువ ఉందని తెలిపారు. తండ్రి మరణించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని, అదేస్ఫూర్తితో షర్మిల కూడా ప్రాంతీయ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయాలను ప్రోత్సాహస్తుంది:సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్!

Drukpadam

గన్నవరం విమాశ్రయంలో రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము కు గ్రాండ్ వెల్కమ్!

Drukpadam

నెల్లూరు వైసీపీలో ప్రకంపనలు…

Drukpadam

Leave a Comment