తెలంగాణాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా పార్టీకి గుడ్ బై

తెలంగాణాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా పార్టీకి గుడ్ బై
-టీఆర్ యస్ లో చేరేందుకు రంగం సిద్ధం
-శాసనసభ కార్యదర్శికి లేక అందజేత
-కేసీఆర్ ను కలిసిన మెచ్చా ,సండ్ర
-టీడీపీ శాసనసభ పక్షం టీఆర్ యస్ లో విలీనం

తెలంగాణాలో టీడీపీ కి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన టీఆర్ యస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణాలో ఇద్దరు శాసనసభ్యులు ఎన్నికైయ్యారు. వారు ఇరువురు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ఎన్నిక కావటం జరిగింది. ఇప్పటికే సండ్ర టీడీపీ కి గుడ్ బై చెప్పి టీఆర్ యస్ కు అనుబంధంగా ఉన్నారు. అప్పటి నుంచి మెచ్చనే తెలుగుదేశం ప్రతినిధిగా శాసనసభలో ఉన్నారు. ఆయన్ను తెలుగు దేశం ఉపాధ్యక్షుడుగా కూడా చంద్రబాబు నియమించారు. పార్టీ పదవికి ,ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన సీనియర్ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య తో కలిసి కేసీఆర్ కలిశారు. అనంతరం స్పీకర్ కలిశారు. శాసనసభ కార్యదర్శిని కలిసి పార్టీ శాసనసభ పక్షం విలీనానికి సంబందించిన లేఖను అందజేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంతారెడ్డి తో భేటీ అయ్యారు. శాసనసభ విలీనంపై శాసనసభ కార్యాలయం ప్రకటన చేసే అవకాశం ఉంది.

Leave a Reply

%d bloggers like this: