Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాస్కులపై మరింత కఠినం : డిఐజి ఏ.వి..రంగనాధ్

  • – నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు 19 కేసులు
  • – ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచన
  • – ఎన్నికల కమిషన్, హైకోర్టు అదేశాల మేరకు మాస్కులపై కఠిన వైఖరి

నల్లగొండ : కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించని వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తామని డిఐజి ఏ.వి. రంగనాధ్ హెచ్చరించారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాస్కులు ధరించకుండా ప్రచారపర్వంలో పాల్గొన్న పలువురిని గుర్తించడం ద్వారా సంబంధిత నిర్వాహకులపై 19 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇందులో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్వాహకులపై ఏడు కేసులు, కాంగ్రేస్ పార్టీకి చెందిన నిర్వాహకులపై ఆరు కేసులు, బిజెపికి సంబందించిన నిర్వహకులపై ఆరు కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. హాలియా పరిధిలో మూడు కేసులు, నిడమనూర్ పరిధిలో మూడు కేసులు, త్రిపురారం పరిధిలో రెండు కేసులు, విజయపురి టౌన్ పరిధిలో మూడు కేసులు, పెద్దవూర పరిధిలో రెండు కేసులు, తిరుమలగిరి సాగర్ పరిధిలో రెండు కేసులు మొత్తం 19 కేసులు నమోదు చేశామని చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హైకోర్టు, ఎన్నికల కమిషన్, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను విధిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం మూడు జి.ఓ.లు జారీ చేసిందని వాటికి అనుగుణంగా బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించని వారిపై, అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించే సంబందిత నిర్వాహకులపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం మతపరమైన సమావేశాలకు ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించేది లేదని తెలిపారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల క్రమంలో పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్న సభలు, రోడ్ షోలు, సమావేశాలలో వారు విధిగా మాస్క్ ధరించడంతో పాటు పాల్గొనే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రజలు మాస్కులు ధరించే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని ఎస్పీ రంగనాధ్ కోరారు.

ఉప ఎన్నికల ప్రచారంలో మాస్కులు ధరించని వారిపై ప్రత్యేక దృష్టి
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులు, నాయకుల వెంట వందల సంఖ్యలో పాల్గొంటున్న క్రమంలో కరోనా వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించి మాస్కులు ధరించని వారిపై, సంబంధిత నిర్వహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల సమావేశాలు, సభలలో సానిటైజర్లు వాడే విధంగా చూసుకోవాలని సూచించారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీల కార్యకర్తలు పాల్గొంటున్న క్రమంలో కరోనా వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా మాస్కులు ధరించని వారిపై జరిమానాలతో పాటు కేసుల నమోదు తప్పదన్నారు.

Related posts

లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు…

Drukpadam

అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం.. 25 మంది సైనికులు సహా 42 మంది మృత్యువాత…

Drukpadam

కోడి ముందా? గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందోచ్..!

Drukpadam

Leave a Comment