Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిలకు అడుగడుగునా జననీరాజం…

షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి …. జోహార్ వైయస్సార్ నినాదాలతో -మారుమోగింది సూర్యాపేట
-షర్మిలకు అడుగడుగునా జననీరాజం
-వైఎస్ షర్మిలకు సూర్యాపేటలో ఘనస్వాగతం
-పలికిన అభిమానగణం… వీడియో ఇదిగో!
-నేడు ఖమ్మంలో షర్మిల బహిరంగ సభ
-పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్న షర్మిల
-సూర్యాపేటలో 5 వేల మందితో పిట్టా రాంరెడ్డి సేన స్వాగతం
-కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్న షర్మిల
ఖమ్మం సంకల్ప సభకు బయలుదేరిన వైయస్ షర్మిల హైద్రాబాద్ లోటస్ పాండ్ నుంచి వందలాది వాహనాలు వెంట రాగ ఆమె ఖమ్మం చేరుకున్నారు. దారిపొడవునా ఆమెకు జననీరాజనాలు పలికారు. షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి …. జోహార్ వైయస్సార్ నినాదాలతో జాతీయ రహదారి వెంట ప్రధానమైన పట్టణాలు మారుమోగాయి. సూర్యాపేట లో నాలుగు కూడలి రహదారి జనంతో కిక్కిరిసింది. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించాలన్న సంకల్పంతో ముందుకు కదులుతున్న వైఎస్ షర్మిల నేడు ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం షర్మిల, ఆమె తల్లి వైఎస్ విజయమ్మ హైదరాబాదు నుంచి ఖమ్మం బయల్దేరారు. కొద్దిసేపటి కిందట షర్మిల కాన్వాయ్ సూర్యాపేట చేరుకోగా, ఘనస్వాగతం లభించింది. పిట్ట రాంరెడ్డి వర్గం దాదాపు 5 వేల మందితో షర్మిలకు సూర్యాపేటలో అదిరిపోయేలా స్వాగతం పలికింది.
అక్కడ్నించి ఆమె ఖమ్మం చేరుకున్నారు. షర్మిల ఖమ్మం శివారు ప్రాంతం పెద్దతండా వద్ద వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆపై పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. షర్మిలతో పాటు ఆమె తల్లి విజయమ్మ కూడా వస్తుండడంతో ఈ సభపై ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీ వర్గాల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమె సభకు వచ్చే స్పందన ఎలావుంటుంది అనే వివరాలు సేకరించే పనిలో రాజకీయ నేతలు పడ్డారు. సభకు ముందే పెవిలియన్ గ్రౌండ్ నిండి పోయింది. కలకకారుల ఆటపాటలతో సభికులను అలరించారు.పాటల్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ ఆలోచింపచేశారు.

Related posts

వారణాసిలో బూత్ కార్యకర్తలతో మోదీ మీటింగ్.. చాలా కుర్చీలు ఖాళీ!

Drukpadam

ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

Drukpadam

ఉత్తర‌ప్ర‌దేశ్ సీఎం అభ్య‌ర్థిగా ప్రియాంకా గాంధీ?..

Drukpadam

Leave a Comment