Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల సభకు ముస్తాబైన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్

షర్మిల సభకు ముస్తాబైన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్
-దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి భారీ కటౌట్లు
-మధ్యాహ్నం 4 గంటలకు ఖమ్మం చేరుకోనున్న షర్మిల ,విజయమ్మ
-ఖమ్మం సరిహద్దులలో ఘన స్వాగతం పలకనున్న నేతలు
-సూర్యాపేటలో లంచ్
షర్మిల ఈ రోజు ఖమ్మం లో జరపతల పెట్టిన సంకల్ప సభకు ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి.కొండా రాఘవరెడ్డి, నాగిరెడ్డి , లక్కినేని సుధీర్ లు వేదిక బహింరంగా సభ ఏర్పాట్లను చూస్తున్నారు. భారీ వాహనాలతో ఆమె హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరి రోడ్ మార్గం ద్వారా ఖమ్మం చేరుకుంటారు. ఉభయ రాష్ట్రాలలలోని అన్ని రాజకీయ పార్టీలు షర్మిల సభ పై ద్రుష్టి సారించాయి. ఆమె ఏమి మాట్లాడతారు.జెండా ,ఎజెండా ఏమిటి అనేది ఆశక్తి గొల్పుతుంది . హైదరాబాద్ ,విజయవాడ జాతీయ రాజదారిపై ఆమె ప్రయాణించనున్నారు. చౌటుప్పల్ , చిట్యాల , నార్కట్ పల్లి , నకిరేకల్ ,సూర్యాపేట తదితర చోట్ల ఆమెకు అభిమానులు స్వాగతం పలకనున్నారు.ఖమ్మం లో ఆమె ర్యాలీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

పెవిలియన్ గ్రౌండ్ చాల చిన్నది . అక్కడ కేవలం ఐదు నుంచి ఆరు వేలమంది మాత్రం షర్మిల సభలో పాల్గొనాలని షరతు విధించారు. లేకపోతె చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 68 ,69 కింద నోటీసులు కూడా జారీచేశారు. పోలీసులు నిర్వాహకులను పిలిచి సభ పై ఉన్న ఆంక్షలను గుర్తు చేశారు. నిబంధనల ప్రకారమే సభ జరుపుతామని నిర్వాహకులు చెబుతున్న అది సాధ్యమా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆరు వేలమంది అంటే పెద్ద హాళ్ల మీటింగా లాంటిది. మొదటి సభ కావడం తో ఆమె ఏమి మాట్లాడతారు .అనేది రాజకీయ వర్గాలలో ఆశక్తి నెలకొన్నది .ఇప్పటికే సభ కోసం వివిధ జిల్లాలకు చెందిన వైయస్ అభిమానులు ఖమ్మం చేరుకుంటున్నారు. సభ దగ్గర గేట్లను ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే ముందు శానిటైజ్ చేసిన తరువాతనే లోనికి పంపుతారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలనే నిబంధన పెట్టారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆవకాశం ఉంది .

షర్మిల ఇంటివద్ద కోలాహలంకార్లన్ని ఖమ్మం వైపు

. సభ సాయంత్రం 5 గంటల తరువాత జరగనుండగా, ఉదయం 8 గంటలకు ఆమె రోడ్డు మార్గాన ఖమ్మం బయలుదేరనున్నారు. ఉదయం 8 గంటలకు షర్మిల కాన్వాయ్ బయలుదేరనుండగా, ఆమె వెంట తరలి వెళ్లేందుకు ఇప్పటికే భారీ ఎత్తున షర్మిల అభిమానులు ఆమె నివాసం వద్దకు చేరుకోవడంతో కోలాహలంమొదలైంది. వందల కొద్దీ వాహనాలు ఆమెతో పాటు బయలు దేరి వెళ్లనున్నాయి.

ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరే షర్మిల కాన్వాయ్ లక్డీకాపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మీదుగా ప్రయాణించి, 9.30 గంటలకు హయత్ నగర్ చేరుకుంటారు. అక్కడ ఆమె అభిమానుల స్వాగతాన్ని స్వీకరిస్తారు. ఆపై చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట మీదుగా ఆమె కాన్వాయ్ సాగనుంది. దారిపొడవునా షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్యాపేట దాటిన తరువాత చివ్వెంల వద్ద ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుని, నామవరం, నాయకన్ గూడెం మీదుగా సాయంత్రం 5.15 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

ఇక సభను విజయవంతం చేయాలన్న తలపుతో వైఎస్ఆర్, షర్మిల అభిమానులు, కొండా రాఘవరెడ్డి, సతీశ్ రెడ్డి వంటి వారి నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. సభకు వైఎస్ భార్య విజయమ్మ కూడా హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక సభలోనే తెలంగాణలో తాను పార్టీని పెట్టబోయే తేదీ గురించిన వివరాలను షర్మిల వెల్లడిస్తారని ఆమె వర్గం నేతలు అంటున్నారు.

Related posts

ఏపీ యస్ ఇ సి ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల మండిపాటు

Drukpadam

బీఆర్ యస్ అవినీతి పార్టీ దానితో యుద్ధమే … షర్మిల

Drukpadam

ఖమ్మం మేయర్ గా సీల్డ్ కవర్ లో పేరెవరిది ?

Drukpadam

Leave a Comment