Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

హర్యానా లో జర్నలిస్ట్ పై సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు

హర్యానా లో జర్నలిస్ట్ పై సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు
-ఖండించిన ఐ జె యూ …భావస్వేచ్ఛపై దాడి అని విమర్శ
– కేసు బేషరత్ గా ఎత్తివేయాలని డిమాండ్
– ఢిల్లీ రైతు ఉద్యమ వార్తలు కవర్ చేసినందుకే కక్ష గట్టారని ఆరోపణ
హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ కు చెందిన పోలీసులు రాజేష్ కుందు అనే జర్నలిస్ట్ పై సైబర్ నేరం కింద కేసు బుక్ చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్మూ తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ భావస్వేచ్ఛపై దాడేనని అభిప్రాయపడ్డారు. పాలకవర్గాలు తమకు నచ్చని వార్తలు రాసిన విలేకరులపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని విమర్శించారు. హిస్సార్ లో రాజేష్ కుందు ” ది ఇంక్” అనే పోర్టల్ నడుపుతూ ఛానల్ లో పని చేస్తున్నారు. ఆయన ఒక వార్తను తన పేస్ బుక్ ఖాతా తో పాటు వాట్సాప్ లో పోస్ట్ చేశారు. దానిపై హర్యానా పోలీసులు కేసు అక్రంగా రిజిస్టర్ చేయటం దారుణమన్నారు. సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం నేరం ఎలా అవుతుంది. ఇది రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనాస్వేచ్ఛపై దాడిగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఒక విలేకరిగా ,భాద్యత గల పౌరుడిగా తన విధి నిర్వాణలో భాగంగా అనేక వార్తలు రాశాడని అన్నారు. ప్రత్యేకించి ఢిల్లీలో జరుగుతున్నా రైతు ఉద్యమాలపై కుందు అనేక వార్తలు ఇచ్చారని అందుకని ఆయనపై ఆగ్రహంగా ఉన్న పాలకులు పోలిసుల చేత కుట్ర పూరితంగా కేసులు పెట్టించారని విమర్శించారు. వెంటనే కుందు పై పెట్టిన కేసు బేషరత్ గా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

తోటి జవాన్లపైకి సైనికుడి కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు!

Drukpadam

మరో యువతిని పెళ్లాడుతున్న ప్రియుడు.. అబ్బాయిలా వచ్చి యాసిడ్ పోసిన ప్రియురాలు.. ఆగిన పెళ్లి!

Drukpadam

విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని నెట్టారంటూ సోము వీర్రాజుపై కేసు నమోదు!

Drukpadam

Leave a Comment