మోదీ, అమిత్ షా మూడో కన్ను తెరిస్తే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బాపూరావు

  • టీఆర్ఎస్ సర్కారు అవినీతిమయం అని విమర్శలు
  • ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం
  • ఎమ్మెల్యే జోగు రామన్నపై ఆరోపణలు
  • కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని వెల్లడి
  • అడ్రస్ లేకుండా చేస్తానంటూ వార్నింగ్
BJP MP Soyam Bapurao fires on KCR and Jogu Ramanna

టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడో కన్ను తెరిచారంటే సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. అవినీతి కార్యకలాపాలతో వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే జోగు రామన్నపైనా నిప్పులు చెరిగారు. జోగు రామన్న పెద్ద అవినీతిపరుడు అని, కోట్ల రూపాయల మేర అక్రమాలు చేశాడని అన్నారు. నన్ను ఏదో చేయాలని చూస్తే అడ్రస్ లేకుండా చేస్తా అని సోయం బాపూరావు హెచ్చరించారు. తాను నక్సల్స్ కే భయపడలేదని, జోగు రామన్న ఓ లెక్కా? అంటూ వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడితే నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు… సోయం బాపూరావు దండు కదిలితే తట్టుకోలేరు అని స్పష్టం చేశారు.

Leave a Reply

%d bloggers like this: