Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి లో టీడీపీ ,వైసీపీ లమధ్య మాటల యుద్ధం

-టీడీపీ ,వైసీపీలు పరస్పర ఆరోపణలు
-రౌడీ రాజ్యం నశించాలని చంద్రబాబు నినాదాలు
-దమ్ముంటే ముందుకు రావాలని సవాల్
-తాట తీస్తా … తోలు తీస్తా తమాషాగా ఉందా అని వార్నింగ్
-ఎస్పీ కి ఫిర్యాదు … చర్యలు తీసుకోవాలని డిమాండ్
-తమ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కోసం ఢిల్లీకి అన్న చంద్రబాబు
-చంద్రబాబు పై దాడి చేసిన వారిపై చర్యతీసుకోవాల్సిందే … పెద్దిరెడ్డి
-మా పార్టీ వాళ్ళు అయితే మెమే పట్టిస్తాం
-డ్రామాలు ఆడవద్దని హితవు … కార్యకర్త అరుస్తున్న పట్టించుకోలేదు
-రాయి వేస్తె దెబ్బ తగలాలి ఎవరికైనా తగిలిందా అన్న పెద్దిరెడ్డి
-ఓడిపోతామనే భయంతోనే ఆరోపణలు
-చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ .
-ఆయనే రౌడీ రాజ్యం నశించాలని నినాదాలు ఇస్తున్నారు
తిరుపతి లోకసభ ఎన్నికల్లో టీడీపీ ,వైకాపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆదివారం ప్రతిపక్షనేత ,మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతి లో జరిపిన రోడ్ షో సందర్భంగా ఆయన పై రాళ్లదాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు .రోడ్ పై బైటహించారు .రాయిని పట్టుకొని చూపిస్తూ దమ్ముంటే తనకు ఎదురుగ రావాలని సవాల్ విసిరారు . ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వెనక నంచి వచ్చిందని అది అక్కడ గుమిగూడిన ప్రజల్లో ఒకరికి తగిలి గాయమైందని చంద్రబాబు ఆరోపణ .

 

అలాంటిదేమి లేదని , ఏవక్కరికి రాయి అక్కడ ఉన్న ఏ ఒక్కరికి తగలలేదని ఒక వేళ నిజంగా రాయివేస్తే అధిమపార్టీ వాడైనా సరే శిక్షించాల్సిందే అని మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి అన్నారు. ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు కావాలని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు . తిరుపతిలో మీడియా తో పెద్దిరెడ్డి మాట్లాడుత చంద్రబాబు ఓటమి భయం పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజం ఎత్తారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తానే స్వయంగా రౌడీ రాజ్యం నశించాలని నినదించటం ,తాటతీస్తా ,తోలుతీస్తా ,తమాషాగా ఉండ అంటూ మాట్లాడటం వెంటనే ఎస్పీ ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేయటం చూస్తుంటే పథకం ప్రకారం చేసినట్లుగా ఉందని అన్నారు. నిజంగా ఓవరు రాయి విసిరారో పోలీసులు విచారణ జరపాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ కార్యకర్త చేస్తే తామే పోలీసులకు అప్పగిస్తామని కాని చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.

తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రోడ్ షోలో ప్రసంగిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆపై ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తన రోడ్ షోలో జరిగిన రాళ్ల దాడిని చంద్రబాబు ఎస్పీకి వివరించారు. ఎస్పీకి ఫిర్యాదు అనంతరం చంద్రబాబు నిరసన విరమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభపై జరిగిన రాళ్ల దాడి రాజకీయ కుట్ర అని ఆరోపించారు. టీడీపీ నేతలపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారని వెల్లడించారు. టీడీపీని లేకుండా చేయాలని వైసీపీ దుష్ట పన్నాగాలకు పాల్పడుతోందని అన్నారు. రాళ్ల దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.
టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరిస్తారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నిష్పాక్షికంగా వ్యవహరించాలని, పోలీసులు సీఈసీ పరిధిలో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలని కోరారు.

Related posts

నెపం నాదికాదు…కేసీఆర్, కేటీఆర్ లది …మంత్రి మల్లారెడ్డి!

Drukpadam

కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆరే నిర్ణయిస్తారు: బండి సంజయ్

Drukpadam

తిరుపతి లో బీజేపీ పోటీ ఖాయం

Drukpadam

Leave a Comment