Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బంగారం అక్రమ రవాణాలో ఎన్నో జిమ్మిక్కులు

బంగారం అక్రమ రవాణాలో ఎన్నో జిమ్మిక్కులు
-దేశంలో ప్రధానంగా 10 ఎయిర్ పోర్టులు , 3 ఓడరేవుల ద్వారా అధికంగా రవాణా
-అక్రమ రవాణాకు దిగుమతి సుంకాలు పెంచటమే కారణమా ?
-మహిళలకు స్టేటస్ సింబల్ గా బంగారం

బంగారం తరలింపులో ఎన్నో కొత్త కొత్త యత్నాలు, మరెన్నో మ్యాజిక్కులు.. ఇంకెన్నో జిమ్మిక్కులు. అయినాకాని కస్టమ్స్ అధికారులకు చిక్కేస్తున్నారు అక్రమ తరలింపు దారులు. తాజాగా ఒక వ్యక్తి వినూత్నంగా సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారాన్ని దాచుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పలేకపోయాడు.  6 E – 25 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడ్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్ట్ లో తనిఖీ చేయగా సూట్ కేస్ ఫ్రేమ్ లో ఈ బంగారం బయటపడింది. దీంతో సదరు వ్యక్తిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. బంగారాన్ని అతని సూట్‌కేస్ యొక్క ప్రత్యేకంగా రూపొందించిన లోపలి ఫ్రేమ్ లో దాచారని పేర్కొన్నారు. ఇలా తీసుకొచ్చిన బంగారం విలువ 13.6 లక్షలుగా పేర్కొన్నారు. మొత్తంగా 381 గ్రాముల 18 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాగా, ఇటీవలే హైదరాబాద్ శంషాబాద్‌ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రయాణికుడు బంగారాన్ని తీసుకువస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి రూ.60 లక్షల విలువైన 1.2 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. అయితే ఈ బంగారం దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కూడా బంగారం ను రకరకాల పద్దతుల ద్వారా విదేశాలనుంచి తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సందర్బాలు ఉన్నాయి .ఒక వ్యక్తి బంగారాన్ని దొంగతనంగా తీసుకొని వచ్చేందుకు తన షూస్ నే ప్రత్యేకంగా తయారుచేయించారు.


మనదేశంలో బంగారానికి మంచి గిరాకీ ఉండటంతో పాటు ,జనాభా అధికంగా ఉండటం , మహిళలు తమ స్టేటస్ కు సింబల్ గా వాడుతుండటంతో దీనిపై మంచి వ్యాపారం జరుగుతుంది. విదేశాలలో బంగారం వాడుతున్న పెద్దగా మనలాగా 22 క్యారట్లు ,24 క్యారట్లు వాడరు.అందువల్లనే బంగారం అక్రమ రవాణా చేసే దేశాలలో మనం అగ్రస్థానంలో ఉన్నాం . విదేశాలనుంచి దేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై , కోజికోడ్ , కోచి , బెంగుళూరు ,కోలకతా,తిరుచిరాపల్లి , హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లనుంచి బాగా అక్రమంగా మన దేశంలోకి తెస్తున్నారు. గతంలో 2 శాతంగా ఉన్న బంగారం దిగుమతి సుంకాన్ని 2012 కేంద్రం 12 .5 శాతానికి పెంచింది.తరువాత 2 శాతం తగ్గించి దాన్ని 10 శాతం చేసి జీఎస్టీ రూపంలో మరో 3 శాతం వడ్డించింది. 2019 -20 లో 2668 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు సంవత్సరం 2946 కేజీలు పట్టుకున్నారు. చెన్నై , గుజరాత్ లోని హాజిరా , ముంద్ర ఓడరేవుల ద్వారా కూడా బంగారం అక్రమ రవాణా జరుగుంది అనేది అధికారులు గుర్తించారు. అక్రమంగా రవాణా చేసేవారు కస్టమ్స్ కళ్ళు కప్పేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. షూస్ , బాడీలో ఇన్సర్ట్ చేయటం ద్వారా ,సబ్బులు, బేబీ సబ్బులు , సూట్ కేసులు ప్రత్యేకంగా తయారు చేయించుకొని తీసుకొస్తున్నారు. వచ్చి బంగారంలో అధికారులు పట్టుకునేది కొద్దిమొత్తమే అని పెద్ద ఎత్తున దేశంలోకి బంగారం అక్రమంగా వస్తూనే ఉంది .

Related posts

వివేకానందరెడ్డి హత్య కేసు.. మాజీ డ్రైవర్‌ను ఏడు గంటలపాటు విచారించిన సీబీఐ…

Drukpadam

గేటు తీయడం ఆలస్యమైనందుకు టోల్ గేట్ ఉద్యోగి హత్య…!

Drukpadam

తెలంగాణాలో మరో మెడికో ఆత్మహత్య…

Drukpadam

Leave a Comment