Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖ‌మ్మంలో టీఆర్ఎస్ కు షాక్‌

-సీఎల్పీ నేత ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ లో చేరిన 400 కుటుంబాలు
-మంత్రిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన సీఎల్పీ నేత‌

ఖ‌మ్మం మునిసిల్ ఎన్నిక‌ల ప్రచారాన్ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ప్రారంభించారు.ఖమ్మంలోని మామిళ్ళ‌గూడెం లో జరిగిన స‌భలో టీఆర్ యస్ ప్రభుత్వంపైన మంత్రి పువ్వాడ అజయ్ పైన ద్వజమెత్తారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 400 కుటుంబాల‌ను కండువాక‌ప్పి ఆయ‌న స్వాగ‌తం ప‌లికారు . మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌న్న ధీమాను ఆయ‌న వ్య‌క్తం చేశారు. మామిళ్ల‌గూడెంలో జ‌రిగిన స‌భ‌లో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు డీసీసీ అధ్య‌క్షుడు పువ్వాళ్ల దుర్గాప్ర‌సాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ‌ర రావు, ఖ‌మ్మం న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌హ‌మ్మ‌ద్ జావేద్‌, ఇత‌ర కార్పొరేట‌ర్లు, సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు.

ఖ‌మ్మం పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ప్ప‌క గెలుస్తుంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. స‌మ‌స్య‌ల ప‌క్క‌న పెట్టి.. కేవ‌లం అధికారం, డ‌బ్బు, మ‌ద్యం, అహంభావం పెట్టుకుని ఖ‌మ్మం పుర‌పాలిక ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అగ్ర‌హంగా చెప్పారు. ప్ర‌జాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన‌ది. మ‌న ఓటు ద్వారా ఏర్పాటు చేసుకున ప్ర‌భుత్వాలు మాత్ర‌మే మ‌న‌కు కావాల్సిన స‌దుపాలును ఏర్పాటు చేస్తామ‌ని భ‌ట్టి అన్నారు. రేపు జ‌రిగే ఎన్నిక మ‌న అవ‌స‌రాలు తీర్చే కాంగ్రెస్ పార్టీకి, ఓట‌ర్ల‌ను టోకుగా అక్ర‌మ సంపాద‌న‌తతో వంద‌ల వేల రూపాయాల‌తో కొనే పార్టీకి మ‌ధ్య జ‌ర‌గబోతోదంని భ‌ట్టి చెప్పారు. ఖ‌మ్మం జిల్లానుంచి రాష్ట్రానికి అత్య‌ద్భుత నాయ‌కులు వచ్చారు. త్యాగాలు చేసిన నాయ‌కులు వచ్చారు.. మంత్రులు, ముఖ్య‌మంత్రులు కూడా వ‌చ్చారు.. కానీ ఇలా పువ్వాడ అజ‌య్ లా ఎవ‌రూ లేర‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. అధికార‌మంటే మ‌మ‌తా మెడిక‌ల్ కాలేజీ అభివృద్ధి, పోలీస్ యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డం కాద‌ని భ‌ట్టి అగ్ర‌హంగా అన్నారు. అధికార‌మంటే మ‌న‌ల్ని ఎదిరించే వారిమీద అక్ర‌మ కేసులు పెట్ట‌డం కాద‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ ను ఉద్దేసించి భ‌ట్టి విక్ర‌మార్క తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఖమ్మం రాజ‌కీయంగా చాలా చైత‌న్య‌వంత‌మైన ప్రాంత‌మ‌ని భ‌ట్టి చెప్పారు.
ఈ మ‌ధ్య కాలంలో ఖ‌మ్మం జిల్లా ఏమి పాపం చేసుకుందో తెలియ‌దు కానీ.. రాజ‌కీయ‌మంటే వ్యాపార‌మ‌నుకున వ్య‌క్తి నేడు మంత్రిగా కొన‌సాగుతున్నాడ‌ని భ‌ట్టి తీవ్ర‌స్థాయిలో పువ్వాడ‌పై ధ్వ‌జ‌మెత్తారు. పేద‌ల కోసం నాటి కాంగ్రెస్ పార్టీ తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 58, 59 అడ్డం పెట్టుకుని మ‌మ‌తా కాలేజీ ద‌గ్గ‌ర అక్ర‌మించున్న భూముల‌ను రెగ్య‌ల‌రైజ్ చేయించుకున్నారంటూ మంత్రిపై భ‌ట్టి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. మంత్రిగా, పాల‌న‌లో భాగ‌స్వామిగా ఉన్న వ్య‌క్తి.. పేద‌ల‌కోసం కాకుండా త‌న స్వార్థం కొసం చ‌ట్టాల‌ను, జీవోల‌ను వాడుకున్న నీకు మంత్రిగా ఉండే అర్హ‌త లేద‌ని మంత్రిని ఉద్దేశించి భ‌ట్టి అగ్ర‌హంగా వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు అందించిన ప‌ద‌విని అడ్డం పెట్టుకుని భూముల‌ను స్థలాల‌ను అక్ర‌మించుకోవ‌డం, కాంట్రాక్టుల‌ను కావాల్సిన వారికి ఇవ్వ‌డం, ప్ర‌శ్నించిన వారిపై పోలీసు కేసులు పెట్ట‌డం అనే ఆలోచ‌న‌తోనే పువ్వాడ అజ‌య్ పాల‌న చేస్తున్నార‌ని భ‌ట్టి ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌ల‌కు భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌, స్వాతంత్రం ఖ‌మ్మం వాసుల‌కు లేద‌ని భ‌ట్టి చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు భ‌యంభ‌యంగా బ‌త‌కాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని అన్నారు.
నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఉద్యమాలు చేస్తున్న క‌మ్యూనిస్ట్ నాయ‌కులు అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పాల‌న చేశాయ‌ని అన్నారు. స‌ర్వ‌స్వ‌తంత్రంగా ప్ర‌జ‌లంతా త‌మ చేతిలోని ఓటును మీ కోసం ప‌నిచేస్తున్న కాంగ్రెస్ నాయ‌కుల‌కు వేసి గెలిపించాల‌ని భ‌ట్టి కోరారు. బెదిరించి, అదిరించి, అవ‌స‌ర‌మైతే ఏ రేటుకైనా ఓట్ల‌ను కొనేవారికి మ‌నం ఓట్లు వ‌స్తే వారు భవిష్య‌త్ లో మ‌న‌ల్ని కూడా అమ్ముతార‌ని భ‌ట్టి చెప్నారు. మ‌నం ఎవ‌రూ ఇక్క‌డ అమ్మ‌కానికి సిద్దంగా లేవ‌ని భ‌ట్టి గ‌ట్టిగా చెప్పారు.
గ‌తంలో కాంగ్రెస్ పార్టీ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను చాలా త‌క్కువ ధ‌ర‌కు అందించింది.. అదే విధంగా ఉప్పులు, ప‌ప్పులు, నూనెలు కూడా అత్యంత చౌక ధ‌ర‌కే అందించామ‌ని భ‌ట్టి చెప్పారు. అప్ప‌ట్లో గ్యాస్ ను రూ. 350కి అందిస్తే.. ఇప్పుడు అది రూ. 1000 చేరింద‌ని అన్నారు. సామాన్యుడు రాష్ట్రంలో బ‌తికే ప‌రిస్థితి లేద‌న్నారు. ధ‌ర‌లు కింద‌కు దించ‌డానికి ఈ ఎన్నిక‌ల్లో మా ఓటు ద్వారా మీకు బుద్ది చెబుతున్నామ‌ని అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని భ‌ట్టి పిలుపునిచ్చారు. ధ‌ర‌లు కింద‌కు దిగిరావాల‌న్నా, సామాన్యుడు బ‌త‌కాల‌న్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌ని అన్నారు.

Related posts

పేరూరు డ్యామ్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈత విన్యాసాలు…

Drukpadam

ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ముస్లిం మహిళ.. ఫత్వా జారీ!

Drukpadam

కోక్ తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందట.. తాజా అధ్యయనంలో వెల్లడి!

Drukpadam

Leave a Comment