Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కరోనా నేపథ్యంలో ఎన్నికల సభలు రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ

కరోనా నేపథ్యంలో ఎన్నికల సభలు రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ

భారత్ లో కరోనా విలయం
గత 24 గంటల్లో 2.61 లక్షల కేసులు
పశ్చిమ బెంగాల్ లో ఇంకా 3 విడతల ఎన్నికలు
సభలు, రోడ్ షోలు రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ
ఇతర నేతలు కూడా దీనిపై ఆలోచించాలని పిలుపు
దేశంలో కరోనా వ్యాప్తి పతాకస్థాయికి చేరుకుంది. సెకండ్ వేవ్ బీభత్సకరంగా కొనసాగుతోన్న నేపథ్యంలో దేశంలో లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికలలో తాను పాల్గొనాల్సిన బహిరంగ సభలను రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో 5 విడతల అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, మరో 3 విడతలు మిగిలున్నాయి. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాను బెంగాల్ లో సభలు, సమావేశాల్లో పాల్గొనబోనని రాహుల్ గాంధీ ప్రకటించారు.

బెంగాల్ లో తాను పాల్గొనాల్సిన అన్ని సభలను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. రాజకీయ నేతలందరూ అంశంపై నిర్ణయం తీసుకోవాలని, భారీ ప్రజానీకంతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఏర్పాటు చేస్తే వచ్చే పర్యవసానాలపై లోతుగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాహుల్ మేరకు ట్వీట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ లో ప్రధాన పోటీ అంతా అధికార టీఎంసీ, బీజేపీ మధ్యే నెలకొంది. ఇప్పుడు రాహుల్ సభలు రద్దు చేసుకున్నా కాంగ్రెస్ కు కలిగే నష్టం ఏమీ ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related posts

రోహిత్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత!

Drukpadam

కేసీఆర్ జాతీయ పార్టీ …భారతీయ రాష్ట్ర సమితి పై అసక్తి!

Drukpadam

బండి సంజయ పాదయాత్ర …అడ్డుకున్న టీఆర్ యస్ కార్యకర్తలు …ఉద్రిక్తత

Drukpadam

Leave a Comment