Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో ఇంకా పొడవని పొత్తులు…

ఖమ్మం లో ఇంకా పొడవని పొత్తులు
-కొనసాగుతున్న చర్చలు
– ముగిసిన నామినేషన్లు
-ప్రతిపక్షాల మధ్య ఐక్యత సూన్యం
-పార్టీలలో కొనసాగుతున్న జంపింగ్ లు

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వివిధ పార్టీల నుంచి పోటీచేశేవారు తమమద్దతు దార్లతో కలిసి ప్రదర్శనగా నామినేషన్ సెంటర్ కు వెళ్లి నామినేషన్ వేసారు . కాంగ్రెస్ సిపిఎం ,టీడీపీ కలసి పోటీచేస్తాయని ప్రచారం జరిగినా అవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఎవరితో పొత్తులకు వెళ్ళటం లేదని ప్రకటించింది.టీడీపీ కి ఇటీవలనే చాలామంది రాజీనామా చేసి మంత్రి అజయ్ నాయకత్వంలో టీఆర్ యస్ లో చేరారు . కాంగ్రెస్ సిపిఎం మధ్య పొత్తు ఉంటుందని చెబుతున్న రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు .టీడీపీ ని కలిసి రావాలని కోరుతున్నారు. సిపిఎం 30 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది . మరో 30 డివిజన్లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోతుందో స్పష్టం చేయలేదు. బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేన 12 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది . సిపిఐ , టీఆర్ యస్ కలిసి నడిచేందుకు నిర్ణయించుకోగా వారికీ 3 డివిజన్లలో పోటీకి టీఆర్ యస్ ఆవకాశం కల్పించింది. కాని సిపిఐ మరో రెండు డివిజన్లలో అదనంగా నామినేషన్లు వేసింది. కనీసం ఒక్క డివిజన్ అయినా తమకు వదులు తారనే అభిప్రాయంతో ఉంది.సిపిఐ నామినేషన్లు వేసిన డివిజన్లలో 19 ,43 ,60 15 ,50 ఉన్నాయి . ఇక సిపిఎం 30 డివిజన్లకు పోటీచేస్తున్నట్లు ప్రకటించింది. కాని 35 సిపిఎం అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు అధికారులు ప్రకటించారు. సిపిఎం పోటీచేసే డివిజన్లలు 1 , 2 ,14 ,15 ,60 , 5 6 ,7 53 23 ,25 ,37 ,40 ,42 ,43 44 , 50 ,52 , 17 27 28 ,29 ,30 ,31 32 ,33 ,34 ,35 .36 ,48 , ఉన్నాయి . మొత్తం 60 డివిజన్లకు గాను 522 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో కాంగ్రెస్ 125 టీఆర్ యస్ 163, టీడీపీ 16 ,జనసేన 12 బీజేపీ 84 , సీపీఐ 7, ఇతరులు 92 లు మరికొందరు ఇండిపెండెంట్ లు ఉన్నారు. నామినేషన్లు వేసినవారిలో మంత్రి పువ్వాడ అజయ్ సతీమణి వసంత లక్ష్మి ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయిన సంగతి విదితమే .

Related posts

మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు!

Drukpadam

జగన్ తప్పుకుని సీఎం ప‌ద‌విని బీసీల‌కు ఇస్తారా?: య‌న‌మ‌ల

Drukpadam

అమెరికాలో ఎన్టీఆర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ నుంచి పూలవ‌ర్షం..

Drukpadam

Leave a Comment