ముగిసిన ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు

Queen Elizabeth Leads UK In 1 Minute Silence At Prince Philips Funeral

ముగిసిన ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు

  • ఈ నెల 9న కన్నుమూసిన ప్రిన్స్ ఫిలిప్
  • రాయల్ వాల్ట్‌లో ఖననం
  • నల్లని దుస్తులు ధరించి హాజరైన క్వీన్ ఎలిజబెత్ 2
ఈ నెల 9న కన్నుమూసిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 భర్త ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు నిన్న పూర్తయ్యాయి. విండ్సర్ కేజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో ఉన్న రాయల్ వాల్ట్‌లో ఫిలిప్ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. రాజకుటుంబానికి చెందిన 24 సమాధులు ఇక్కడే ఉన్నాయి. కింగ్ జార్జ్ 3, కింగ్ జార్జ్ 4, కింగ్ విలియం 5ల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి.

ఫిలిప్ భౌతిక కాయాన్ని ఇక్కడే శాశ్వతంగా ఉంచే అవకాశం లేదు. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానంతరం ఇద్దరి భౌతిక కాయాలను ప్రాగ్మోర్ ఎస్టేట్‌కు తరలిస్తారని సమాచారం. కాగా, అంత్యక్రియల సమయంలో ఫిలిప్ కోరిక ప్రకారమే ప్రార్థనలు నిర్వహించారు. క్వీన్ ఎలిజబెత్ నల్లని దుస్తులు, టోపీ, మాస్క్ ధరించి అంత్యక్రియలకు హాజరయ్యారు. మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: