Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నా సతీమణి మేయర్ బరిలో లేరు …మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టీకరణ

నా సతీమణి మేయర్ బరిలో లేరు …మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టీకరణ
-ఆమె కార్పొరేటర్ గా కూడా పోటీచేయరు
-మేయర్ విషయంలో సీఎం కేసీఆర్ దే తుది నిర్ణయం
-అభివృద్ధిలో పోటీ పడితే సంతోషిస్తా
-సద్విమర్శలు స్వాగతిస్తా
-కాంగ్రెస్ హయాంలో ఖమ్మం ఎలావుంది
-ఇప్పుడు ఎలా ఉంది-పోల్చుకోండని అంటున్న
-కాంగ్రెస్ చెల్లని రూపాయ -బీజేపీకి ఉనికే లేదు ఖమ్మం లో సాధ్యం కాదు
నా సతీమణి వసంత లక్ష్మి మేయర్ బరిలో లేరని జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంత్రి సతీమణి ఖమ్మం కార్పొరేషన్ లోని 20 డివిజన్ నించి పోటీ చేయడం, మేయర్ పీఠం మహిళా జనరల్ కు కేటాయించటం తో మంత్రి పువ్వాడ సతీమణి మేయర్ అభ్యర్థి అనే ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ మీడియా సమావేశంలో స్పందించారు. ఆమె కార్పొరేటర్ గా కూడా పోటీచేయరని మంత్రి వెల్లడించారు. మేయర్ విషయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ దే తుదినిర్ణయమని తాను ఇక్కడ ఉన్న విషయాలు మాత్రమే కేసీఆర్ కు చెబుతానని ఆయన ఎవరిని నిర్ణయిస్తే వారిని చేయటమే తప్ప మరో మాటకు తావులేదన్నారు. ఇందులో శషభిషలు అవసరంలేదన్నారు . అభివృద్ధి విషయంలో తన శక్తి వంచనలేకుండా పని చేశానని ,ఇంకా చేస్తానని అన్నారు. ఖమ్మం అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. అంతకుముందు జరిగిన అభివృద్ధి ఇప్పటి అభివృద్ధిని పోల్చుకొని ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గొల్లపాడు ఛానల్ దగ్గరనుంచి కొత్త బస్టాండ్ వరకు జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఐ టి హబ్ , ముస్తఫానగర్ , ధంసలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి , ఖమ్మం లో డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, కూరగాయల మార్కెట్ , పార్కుల అభివృద్ధి,లకారం లేక్ అభివృద్ధి ,వాకర్ పారడైజ్ , ఎన్టీఆర్ సర్కిల్ అభివృద్ధి, ఇల్లందు రోడ్ అభివృద్ధి , అధునాతన టాయిలెట్స్ ఏర్పాటు , జడ్పీ సెంటర్లో 14 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు, ముస్తఫా నగర్ లో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు లాంటివి మంత్రి ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వీటిని పట్టించుకున్న పాపాన పోయిందా అని మంత్రి ప్రశ్నించారు. అభివృద్ధి లో పోటీపడాలే గాని వ్యక్తిగత విమర్శలతో అభివృద్ధిని చూసి కూడా విమర్శలు చేయటం తగదని అన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో విజ్ఞులైన ఖమ్మం ప్రజలకు చెప్పాల్సిన పనిలేదని అన్నారు. ఖమ్మం అభివృద్ధికి కాంగ్రెస్ చేసింది శూన్యంమని అన్నారు. అభివృద్ధిలో పోటీపడితే సంతోషిస్తానని తమ దగ్గర అభివృద్ధి చేసుకోలేని వారు ఇక్కడకు వచ్చి మాటలు చెప్పటం , విమర్శలు చేయటంపై మంత్రి మండి పడ్డారు. ఒకప్పుడు ఖమ్మం ఎలా ఉంది ఎప్పుడు ఎలాఉందనేది భేరీజు వేసుకోవాలని అన్నారు. వారు భేరీజు వేసుకోకపోయినా ప్రజలు తప్పకుండ భేరీజు వేసుకుంటారని అభిప్రాయపడ్డారు. అనేకమంది పార్టీలకు అతీతంగా ఖమ్మం అభివృద్ధిపై ప్రశంసిస్తున్నారని దాన్ని తట్టుకోలేక ఓర్వలేక విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని అన్నారు. అలాంటి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఖమ్మంనగరాన్ని అభివృద్ధి చేశా ఇంకా చేస్తానని మంచి ఆహ్లదకరమైన వాతావరణాన్ని తీసుకొని రావడమే తనముందున్న కర్తవ్యమ్ అన్నారు. కాంగ్రెస్ కు అభివృద్ధి ఎజండా లేదు . అది చెల్లని రూపాయగా మారింది , దానికి అభివృద్ధి చేయడం చేతకాలేదు. బీజేపీకి ఇక్కడ ఉనికి లేదు .చెతన్యవంతమైన ఖమ్మం ప్రజలు బీజేపీ రాజకీయాలను అంగీకరించరని అన్నారు .నేను చేసిన అభివృద్ధిని గతంతో పోల్చుకోండి దాన్ని చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పాల్గొన్నారు. మంత్రి అజయ్ కుమార్ పుట్టినరోజు కావడంతో పలువురు అధికారులు , ప్రజాప్రతినిధులు ,పట్టణ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

ఈ విషయంలో న్యూయార్క్, లండన్, షాంఘైలను కూడా అధిగమించిన ఢిల్లీ!

Drukpadam

నున్నా రవి మృతదేహం లభ్యం

Drukpadam

మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన సింగ‌పూర్ హైక‌మిష‌న‌ర్…

Drukpadam

Leave a Comment