Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు జరుపుతారా? వాయిదా వేస్తారా ? వారిష్టం కోర్ట్ జోక్యం చేసుకోదు…

ఎన్నికలు జరుపుతారా? వాయిదా వేస్తారా ? వారిష్టం కోర్ట్ జోక్యం చేసుకోదు…
-మున్సిపోల్స్ పై ప్రభుత్వం ఎస్‌ఈసీ కలసి నిర్ణయం తీసుకోవాలి హైకోర్టు
-లాక్‌ డౌన్‌, రాత్రి కర్ఫ్యూపై సర్కారు నిర్ణయం 48 గంటలలోగా చెప్పాలి
-చెప్పకపోతే మేమె నిర్ణయం తీసుకుంటాం
-రెండు కార్పొరేషన్ లకు ఐదు మున్సిపాలిటీలకు ఈనెల 30న పోలింగ్
-సుమారు 11 లక్షల మంది ఓటర్లు
-అందరిలోనూ ఉత్కంఠ -వాయిదా వైపే మొగ్గుతున్న ప్రజలు
-ప్రచారంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నా వైనం
-సాగర్ ఎన్నికల్లో పాల్గొన్న పలువురు నేతలకు పాజిటివ్
-ఖమ్మం షర్మిల సభలోను , హైద్రాబాద్ దీక్షలో పాల్గొన్న వారిని వదలని కరోనా
‌ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతుండడంపై.. హైకోర్టు తాజా ఆదేశాలతో మునిసిపల్‌ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూపై 48 గంటలలో నిర్ణయం తీసుకోండి. లేదంటే మేమే ఆదేశాలిస్తామని’ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? మునిసిపల్‌ ఎన్నికలు వాయుదా పడతాయా? ఎన్నికల సంఘం ,రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయని అనే దానిపై ఆశక్తి నెలకొన్నది . గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలకు సాధారణ ఎన్నికలతోపాటు రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 9 మునిసిపల్‌ వార్డులకు ఈనెల 30న ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ జారీ అయ్యింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన సోమవారంతో ముగిసింది. ఈనెల 22న ఉపసంహరణ గడువు కూడా ముగిసి, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెలువడనున్నది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో సుమారు 11 లక్షలకు పైగా ఓటర్లున్నారు. కాగా, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మునిసిపల్‌ ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల నోటిఫికేషన్‌లో తాము జోక్యం చేసుకునేది లేదని, దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ), రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా హైకోర్టు సూచించింది. దీంతో, కరోనా కట్టడి చర్యల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది . సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో ప్రజలు మాత్రం ఎన్నికలు నిలిపి వేయడమే మేలని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఎన్నికలు జరుగుతాయా ? లేదా అనే అనేది ఆధారపడి ఉంటుంది.
కరోనా కట్టడిలో భాగంగా కేవలం రాత్రి వేళ కర్ఫ్యూ/లాక్‌డౌన్‌ అమలు చేయడం వంటివి లేదా వారాంతంలో(శని, ఆదివారాలు) పూర్తిగా లాక్‌డౌన్‌ విధించడం వంటివి చేపడితే మునిసిపల్‌ ఎన్నికలు వాయుదా పడకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఒక వేళ ఢిల్లీ తరహాలో వరుసగా వారం లేదా పది రోజులు పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తే.. అనివార్యంగా ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయవచ్చన్నది మరో వాదనగా ఉన్నది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే నాటికి కొనసాగిన ఎన్నికల ప్రక్రియను అక్కడితో నిలిపి వేసి, తదుపరి ప్రక్రియను వాయిదా వేస్తారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని చెబుతున్నారు. ఎన్నికల సంఘంతో సంప్రదించిన తరువాతనే నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో, కరోనా ఉదృతి పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన అంశం, రెండు రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ఆపై ఎస్‌ఈసీతో కలిసి తీసుకునే నిర్ణయాలపైనే మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఆధారపడి ఉన్నదని ప్రచారం సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వారిలో కొందరు మాస్క్ పెడుతున్నారు. మరికొందరు పెట్టటంలేదు . మంత్రులు ,ప్రజాప్రతినిధులు ,పోటీచేసేవారితో ఎన్నికల ప్రచారమా హోరెత్తుతోంది . రాష్ట్ర హెల్త్ డైరక్టర్ శ్రీనివాస్ రావు గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుంది తెలిపారు. కొందరికి వైరస్ సోకినా పెద్ద నష్టానికి దారితీస్తుంది. కొన్ని రాష్ట్రాలు బడ్జెట్ సమావేశాలను కూడా వాయిదా వేశాయి. పార్లమెంట్ కూడా సెకండ్ వేవ్ దెబ్బకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అనేక దేశాలు విమాన సర్వీసులను సైతం రద్దుచేశాయి.భారత్ లో పెరిగి పోతున్న కేసులకు భయపడి బ్రిటన్ భారత్ నుంచి వచ్చే పౌరులకు నిషేధం విధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సాగర్ లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ లక్షణాలు రావడంతో ఫామ్ హౌస్ కు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఎన్నికలపై ఉన్న ఉత్కంఠ తొలగాలంటే వెంటనే నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది.

కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నందున రాష్ట్రంలోని మునిసిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు జారీచేసిన నోటిఫికేషన్లు నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన రెండు వేర్వేరు వ్యాజ్యాల్లో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయినందున.. తాము ఎలాంటి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాల్లోని పిటిషనర్లు చేసే విజ్ఞప్తులను పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. అభిషేక్‌రెడ్డి సోమవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నందున మునిసిపాలిటీ ఎన్నికలు వాయిదా వేసేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ, మరొకరు వేర్వేరు పిటిషన్లలో సోమవారం లంచ్‌మోషన్‌లో హైకోర్టును ఆశ్రయించారు.

 

 

Related posts

ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్ గా బతుకు నెట్టుకొస్తున్న శ్రీలంక మాజీ క్రికెటర్…!

Drukpadam

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: న్యూజెర్సీ ‘మీట్ అండ్ గ్రీట్’లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ!

Drukpadam

గుజరాత్ ఎన్నికల వేళ అందరినీ ఆకర్షిస్తున్న ‘జంబో ఫ్యామిలీ’…

Drukpadam

Leave a Comment