Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా నిబంధనల మధ్య భధ్రాద్రి రాముని కళ్యాణం..

-పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి..పువ్వాడ ఆజయ్ కుమార్

సీతారామ కల్యాణానికి తప్పని కరోనా… నిబంధనల మద్యే కళ్యాణం
-కేవలం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ,పువ్వాడ అజయ్ , అధికారులు మాత్రమే హాజరు
-ఆలయ లోపలి మండపంలోని కళ్యాణం
-భద్రాచలంలో నిశ్శబ్ద వాతావరణం
ఆకాశమంత పందిరి …భూదేవి అంత పీఠ వేసి అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది జరిగే సీతారాములు కళ్యాణం కరోనా తో నిబంధలమద్యే జరుపుకోవాల్సి వచ్చింది . గత ఏడాది కూడా ఇదే విధంగా జరిపారు.సీతారాముల కల్యాణానికి భద్రాచలం పట్టణానానికి లక్షలాది మంది భక్తులు రాకతో సందడి నెలకొనేది .కాని కరోనా స్వామి వారిని సైతం వదలలేదు. మహమ్మారి కరోనా తో ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పెట్టింది . గతంలో గుడి ముందు ఉన్న మిథిలా స్టేడియం లో అంత్యంత కమనీయంగా ,రమణీయంగా కళ్యాణం జరిగేది. ఆ వేడుకలు రద్దుకావడం భక్తులను నిరాశపరిచింది.

శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, వాటి తర్వాత వీధి వీధి నా వెలసే నవమి పందిళ్ళు.ఆ పందిళ్ళ లో దొరికే బెల్లం పానకమూ, వడపప్పూ. ఆ వైభవానికి తగ్గట్టుగా పందిట్లో పోసే ముత్యాల తలంబ్రాలు, దేనికవే సాటి. కరోనా కారణంగా ఈ ఆనందం అందరికీ దూరం కాగా…భద్రాచలంలో శ్రీ రామనవమి వేడుకలు బుధవారం నిరాడంబ‌రంగా జ‌రిగాయి. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు ,ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు సమర్పించారు.

వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కళ్యాణం జ‌రిగింది దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆల‌య‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు పరిమిత సంఖ్యలో ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.

Related posts

వీకెండ్స్ లో కాళేశ్వరం టూర్.. రూ.2 వేలలోపే ట్రిప్…

Drukpadam

ఇరాక్ లో ప్రాచీన నగరం గుర్తింపు……

Drukpadam

ఝార్ఖండ్​ జడ్జి హత్య కేసు: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment