Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

నాసిక్‌లోని ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం.. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్‌.. 22 మంది మృతి

నాసిక్‌లోని ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం.. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్‌.. 22 మంది మృతి
-మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం
-హాస్పిటల్ లో 171 మంది పేషంట్లు
-ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ నింపుతుండ‌గా ఘ‌ట‌న‌
-వెంటిలేట‌ర్‌పై ఉన్న రోగులకు అంద‌ని ఆక్సిజ‌న్

మ‌హారాష్ట్ర, నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్‌ ఆసుప‌త్రిలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆసుప‌త్రి స‌మీపంలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ నింపుతుండ‌గా ఒక్క‌సారిగా అది లీకైంది. దీంతో ఆ ఆసు‌ప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై ఉన్న రోగుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఇప్పటికే కోవిద్ మరణాలు సంభవిస్తున్న తరుణంలో మానవ తప్పిదంవల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారు మరణించటం పట్ల విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.

ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీక్ కారణంగా రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను ఆపేయాల్సి వ‌చ్చింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం వ‌ల్లే రోగులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన అధికారులు, సిబ్బంది ఆక్సిజ‌న్ లీకేజీని ఆపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు.

ఆక్సిజ‌న్ ట్యాంక్ లీక్ అయిన స‌మ‌యంలో ఆసుప‌త్రిలో 171 మంది రోగులు ఉన్నారు. కొంద‌రు రోగుల‌ను ఇత‌ర ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. నాసిక్ కలక్టర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు . వైద్య ఆరోగ్య శాఖామంత్రి రాజేష్ తోపే తాను నాసిక్ వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రాధమిక విచారణకు ఆదేశించారు. మంత్రి జగన్ భుజబల్ ,అక్కడకు చేరుకున్నారు. వెంటనే మరో హాస్పిటల్ నుంచి ఆక్సిజన్ తెప్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయం చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్సగ్రేషయో ప్రకటించింది . ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

Related posts

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ విజృంభణ… ఉచితంగా చికిత్స ప్రభుత్వ నిర్ణయం

Drukpadam

ఎలుకల నుంచే ఒమిక్రాన్: అమెరికా పరిశోధకులు…

Drukpadam

కొవిడ్ ఒక్కటే కాదు.. ఇతర ఇన్ఫెక్షన్లూ వేధిస్తాయి జాగ్రత్త: డబ్ల్యూహెచ్ఓ…

Drukpadam

Leave a Comment