Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా కట్టడికి ‘బ్రేక్‌ ద చైన్‌’ మహారాష్ట్ర నినాదం…లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు అంటున్న బెంగాల్ సీఎం

 

కరోనా కట్టడికి ‘బ్రేక్‌ ద చైన్‌’ మహారాష్ట్ర నినాదం

లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు అంటున్న బెంగాల్ సీఎం

కరోనా కట్టడి కోసం మరిన్ని కఠిన ఆంక్షలు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
ప్రజా రవాణాపై నియంత్రణ
ప్రైవేటు, ప్రభుత్వ బస్సుల్లో 50 శాతం ఆక్సుపెన్సీ
వివాహాలకు 25 మందికి మాత్రమే అనుమతి
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 15 శాతం సిబ్బంది మాత్రమే
కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ‘బ్రేక్‌ ద చైన్‌’(కరోనా గొలుసును తుంచేయండి) పేరిట పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో ముఖ్యమైనవి.. ప్రభుత్వ(కేంద్ర, రాష్ట్ర), ప్రైవేటు కార్యాలయాలు కేవలం 15 శాతం మంది సిబ్బందితోనే పనిచేయాలి. అత్యవసర సేవలు అందించే విభాగాలు కూడా కనీస సిబ్బందితో పనిచేయాలి. ఏ సమయంలోనూ 50 శాతానికి మించి విధుల్లో ఉండకూడదు. వివాహాలకు కేవలం 25 మందికి మాత్రమే అనుమతి. ఒకేరోజు, ఒకే హాల్లో రెండు గంటలకు మించి ఈ కార్యక్రమం జరగకూడదు. ప్రైవేటు వాహనాలను(బస్సులకు మినహాయింపు) అత్యవసర సేవలకు మాత్రమే వినియోగించాలి. లేదా సరైన కారణం ఉండాలి. అదీ డ్రైవర్‌తో కలిపి వాహన సీటింగ్‌ సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే ఉండాలి. నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రయాణించేందుకు ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.10,000 జరిమానా. ప్రైవేటు బస్సులను 50 శాతం ఆక్సుపెన్సీతో మాత్రమే నడపాలి. ఎవరూ నిలబడి ప్రయాణికూడదు. జిల్లాలు, నగరాల మధ్య నడిచే బస్సులు కేవలం రెండు చోట్ల మాత్రమే ఆపాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10,000 జరిమానా. అవసరమైతే లైసెన్స్‌ రద్దు. ప్రజా రవాణాను కేవలం ప్రభుత్వ, వైద్యారోగ్య సిబ్బంది కోసం మాత్రమే వినియోగించాలి. లేదా ఎవరికైనా వైద్య సాయం కావాలంటే వారికోసం నడపవచ్చు. వీటిలో ప్రయాణించేవారందరికీ సరైన గుర్తింపు కార్డు ఉండాలి.
ప్రభుత్వ బస్సులు సైతం కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడవాలి. ఎవరూ నిలబడి ప్రయాణికూడదు. మహరాష్ట్రలో కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 67 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 568 మంది మరణించారు.

 

లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
ప్రజలను ఇంట్లో బంధించేందుకు నేను వ్యతిరేకం
లాక్ డౌన్ విధిస్తే ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది
అందరూ మాస్క్ కచ్చితంగా ధరించండి
కరోనా భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్ డౌన్లను అమలు చేస్తున్నాయి. ఇక తమ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశమే లేదని చెప్పారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనిపై మమత స్పందిస్తూ… మే 5వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. లాక్ డౌన్ విధిస్తే ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని మమత అన్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ప్రజలను ఇంట్లోనే బంధించేందుకు తాను వ్యతిరేకమని తెలిపారు.

Related posts

కంభంపాటి హరిబాబును గవర్నర్ గా నియమించిన కేంద్రం!

Drukpadam

కెనడాలో 700 మంది భారత విద్యార్థుల ఆందోళన…!

Drukpadam

తిరుపతిలో ఈదురుగాలులు…చెట్టు కూలి డాక్టర్ మృతి…

Drukpadam

Leave a Comment