Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

మాస్క్ అవసరం లేని దేశంగా ఇజ్రాయిల్

మాస్క్ అవసరం లేని దేశంగా ఇజ్రాయిల్
-ప్రపంచంలోనే అరుదైన సన్నీవేషం ఆవిష్కృతం
ఇజ్రాయెల్‌లో మునుపటి స్వేచ్ఛ.. అక్కడిక మాస్కులు లేకుండా తిరిగేయొచ్చు!
తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న ఆదేశాలు రద్దు
దేశంలో సగం జనాభాకు పైగా టీకా
ఇజ్రాయెల్‌పై కురుస్తున్న ప్రశంసలు
ప్రపంచానికి తాము మార్గదర్శకులమయ్యామన్న బెంజమిన్ నెతన్యాహు
ప్రపంచాన్ని గడగడా లాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి బయట పడిన తొలిదేశంగా ఇజ్రాయెల్ గణతికెక్కింది .ప్రపంచంలోనే కరోనా భయంలేదని చాటిన దేశంగా అది నిలవటంతో అన్ని దేశాల నుంచి ప్రసంశలు అందుకుంటుంది . ఇజ్రాయిల్ చేపట్టిన చర్యలు తెలుసుకునేందుకు అన్ని దేశాలు అటు వైపు చూస్తున్నాయి.ఇది ఎలా సాధ్యమైందని ఆరా తీసుతున్నాయి.దేశంలో సగం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వటం జరిగింది.అంటే కాకుండా రెండవ డోసు కూడా ఎక్కువమంది తీసుకున్నారు. 16 సంవత్సరాలు పైబడిన పిల్లలకు తప్ప అందరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఆ దేశం చేపట్టి విజయవంతం అయింది .దీంతో మాస్క్ తప్పని సరిగా ధరించాలన్న నిభందనలు ఎత్తివేసింది .
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తున్న వేళ ఇజ్రాయెల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సగమంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తికావడంతో తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఆదివారం రద్దు చేసింది. ఇకపై మార్కెట్లు, మాల్స్, ప్రార్థనా స్థలాలు, దుకాణాల్లో మాస్కులు లేకుండానే సంచరించవచ్చని పేర్కొంది. అలాగే, బడులను తిరిగి ప్రారంభించింది. ముందుచూపుతో వ్యవహరించి మహమ్మారిపై ఇజ్రాయెల్ విజయం సాధించిందంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రశంసించింది.

ఇజ్రాయెల్‌లో ఇప్పటికే 60 శాతం మందికిపైగా తొలి టీకా తొలిడోసు తీసుకోగా, 56 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారు. అయితే, 16 ఏళ్లలోపు వారికి టీకాల నుంచి మినహాయించారు. మాస్కులు ధరించాలన్న ఆదేశాలను రద్దు చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. వైరస్‌ను ఎదుర్కోవడంలో మిగతా దేశాలకు తాము మార్గదర్శకులమయ్యామని పేర్కొన్నారు.

Related posts

గంగానదిలో మృతదేహాలపై స్పందించిన ఎన్ హెచ్ఆర్సీ…

Drukpadam

త్వరలోనే తోకముడవనున్న ఒమిక్రాన్: ఆంటోనీ ఫౌచి!

Drukpadam

మమతా బెనర్జీ ఇంట విషాదం…

Drukpadam

Leave a Comment