Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు 2 లక్షల ఆర్థిక సహాయం… తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు 2 లక్షల ఆర్థిక సహాయం… తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
– రాష్ట్ర మీడియా అకాడెమీ ద్వారా ఆర్థికసాయం అందజేత
-జర్నలిస్ట్ సంఘాల విజ్నప్తి కి స్పందించిన ప్రభుత్వం
-మే 10లోగా కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకోవాలని సూచన
-ప్రభుత్వ సహాయాన్ని స్వాగతించిన టి యూ డబ్ల్యూ జె
-మరింత ఆర్థిక సహాయం ప్రకటించాలన్న టి యూ డబ్ల్యూ జె
కర్తవ్య నిర్వహణలో భాగంగా పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మీడియా అకాడెమీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయాన్ని ప్రకటించింది. తక్షణ సాయంగా రూ. 2 లక్షలను అందిస్తామని మీడియా అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు, కరోనా పాజిటివ్ రిపోర్టు, అక్రిడేషన్ కార్డును ఆయా జిల్లాల డీపీఆర్వోలు ధ్రువీకరించాల్సి ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అందరికీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. కరోనా బారిన పడిన పాత్రికేయులను కూడా ఆదుకుంటామని… వారు కూడా ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
———————————————————————————————————————
కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయాన్ని స్వాగతించిన టి యూ డబ్ల్యూ జె
—————————————————————————————————————————-
కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తెలిపారు
టీయూడబ్ల్యూజే ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని వారు అన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో కేవలం గత 10 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించటం తీవ్ర విషాదం మని వారు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జర్నలిస్టు సంఘాలు చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకోడాన్ని తమ సంఘం స్వాగతిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిందని అన్నారు . ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు రెండు లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కార్యాలయానికి మే,10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించుకునేలా టీయూడబ్ల్యూజే జిల్లాల బాధ్యులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వారు అన్ని జిల్లా శాఖలకు విజ్ఞప్తి చేశారు. . మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో కరోనా మరణ ధృవీకరణ పత్రము, అక్రిడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టుతో పాటు ఆయా జిల్లాల డి.పి.ఆర్.ఓ.ల ధ్రువీకరణ చేయాల్సి ఉంటుందని వారు అన్నారు .  మరణించిన కుటుంబాల తరుఫున ధృవీకరణ పత్రాలు సమర్పించడానికి ప్రత్యేక చొరవ చూపాలని  యూనియన్ బాధ్యులను కోరారు . దరఖాస్తులను హైదరాబాద్ లోని సమాచార భవన్ లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శికి అందించాలని శేఖర్ విరహత్ లు తెలిపారు

Related posts

ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి.. నల్గొండ డీఐజీ రంగనాథ్

Drukpadam

ఒమిక్రాన్​ సోకిన మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నాం: మంత్రి హరీశ్ రావు!

Drukpadam

మహమ్మారిని ఓడించడంలో భారత్‌కు సహకరిస్తాం: జిన్‌పింగ్‌

Drukpadam

Leave a Comment