Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఆసుప‌త్రిలో తీవ్రమైన ఒత్తిడి, పనిభారం వల్ల గొడ‌వ‌.. డాక్ట‌ర్‌ని కొట్టిన న‌ర్సు.. వీడియో వైర‌ల్

ఆసుప‌త్రిలో తీవ్రమైన ఒత్తిడి, పనిభారం వల్ల గొడ‌వ‌.. డాక్ట‌ర్‌ని కొట్టిన న‌ర్సు.. వీడియో వైర‌ల్
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా ఆసుప‌త్రిలో ఈ ఘ‌ట‌న
న‌ర్సు త‌న‌ని కొట్ట‌డంతో తిరిగి కొట్టిన డాక్ట‌ర్
ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశం
ఓ డాక్టర్‌ను నర్సు చెంప‌పై కొట్టింది.. దీంతో ఆ డాక్ట‌ర్ కూడా ఆమెను కొట్టాడు.. ప‌ర‌స్ప‌రం దూషించుకుంటూ వారు ఆసుప‌త్రిలోనే అంద‌రి ముందూ గొడవ ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు ల‌భ్య‌మైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా ఆసుప‌త్రిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ ఘటనపై నగర మెజిస్ట్రేట్‌ రాంజీ మిశ్రా మీడియాకు వివ‌రాలు తెలిపారు. తాను డాక్ట‌రు, న‌ర్సుతో మాట్లాడానని, వారిద్దరూ తీవ్రమైన ఒత్తిడి, అధిక పనిభారం వల్లే ఇలా చేసినట్లు చెప్పారని వివ‌రించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామ‌ని తెలిపారు. కాగా, ఆసుప‌త్రిలో వైద్యుడికి వద్దకు నర్సు వ‌చ్చి ఓ విషయంపై ప్ర‌శ్నించ‌గా ఆయ‌న అందుకు సరిగ్గా స్పందించ‌కుండా వాగ్వివాదానికి దిగిన‌ట్లు వీడియో ద్వారా అర్థ‌మవుతోంది.

ఈ నేప‌థ్యంలో గొడ‌వ పెరిగి అసభ్య పదజాలంతో ఇరువురూ దూషించుకున్నారు. అక్కడున్న వారు వారిని స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నించారు. ఓ రోగికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశమై వారు గొడవప‌డ్డ‌ట్టు స‌మాచారం.

Related posts

మార్గదర్శి సహా చిట్ ఫండ్ కంపెనీల్లో ఏపీ వ్యాప్తంగా సోదాలు!

Drukpadam

అర్ధరాత్రి వేళ బుద్ధా వెంకన్నను విడిచిపెట్టిన పోలీసులు!

Drukpadam

‘రూ. 100 కోట్లు ఇస్తే మీరే గవర్నర్’.. అంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సీబీఐ!

Drukpadam

Leave a Comment