నేటితో మున్సిపోల్ ప్రచారం బందు…

నేటితో మున్సిపోల్ ప్రచారం బందు
-ప్రలోభాలకు తెరలేపనున్న పార్టీలు
-డబ్బుల పంపిణీదే గెలుపు అవుతుందా ?
-ఎవరు ఎక్కువా డబ్బులు ఇస్తే వారికే ఓట్లా?
– అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా ? పాలక పార్టీ పై వ్యతిరేకత కలిసొన్తుండా ?
ఈ నెల 30 వ తేదీన జరగనున్న మినీ మున్సిపోల్స్ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రంతోతెరపడనుంది. మొత్తం 11 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరోనా విజృభిస్తున్న వేళ అసలు ఎన్నకలు జరుగుతాయా లేదా అనే సందేహాల మధ్య ఎన్నికల ప్రచారము ముగియటంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. అభ్యర్థులతో పాటు ప్రచారంలో పాల్గొనే వారు సైతం కరోనా మహమ్మారితో భిక్కుభిక్కు మంటూ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఇప్పటి నుంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అభివృద్ధి ఎంత చేసినా, ఎన్నికలలో డబ్బులేనిదే ఓట్లు రాలె పరిస్థితులు కనిపించటం లేదు . అయితే అన్ని సందర్భాలలో డబ్బు పని చేయడంలేదని అనేక ఎన్నికలు నిరూపించాయి. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కు వచ్చిన ఓట్లే నిదర్శం . అయితే అది కొంత వరకు మాత్రమే పనిచేయటం జరుగుతుందనే ఉద్దేశంతో అభ్యర్థులు డబ్బుపంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అందువల్ల ఏ ఎన్నికైన కాస్ట్ లీ గా మారింది. దీంతో సామాన్యుడి ,ప్రజాసేవ చేద్దామనుకున్నా, ఎన్నికలు అంటే బయపడి పోతున్నారు. అందుకే కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయాలంటే మినిమమ్ 50 లక్షలు ఉండాల్సిందే . అభ్యర్థులు అందుకు సిద్దమైతేనే పార్టీలు టిక్కెట్లు ఇస్తున్నాయి. ఎన్నికల ఖర్చులో ఎన్నికల నిభందనలు గిబంధనలు జాన్తా నహి అంటున్నారు .యథేచ్ఛగా డబ్బుల పంపిణి జరుగుతూనే ఉంది .

వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో ఈ నెల 30 వ తేదీన మున్సిపల్ ఎన్నిలకలు జరగనున్నాయి. ఇందుకోసం 27 సాయంత్రం ప్రచారం ముగియనున్నది .గత నామినేషన్లకు ముందునుండే రాజకీయపార్టీలలో హడాహుడి కనిపించిన నామినేషన్లు వేసిన దగ్గరనుంచి ప్రచారం జోరందుకుంది . వరంగల్ కార్పొరేషన్ లో 66 డివిజన్లకు , ఖమ్మం లో 60 డివిజన్లకు పోటాపోటీగా ప్రచారం జరిగింది. మిగతా మున్సిపాల్టీలలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.సిద్ధిపేట లో హరీష్ రావు అంట తానై వ్యవహరించారు. జడ్చర్లలో 27 ,సిద్దిపేటలో 43 ,అచ్చంపేటలో 20 ,నకిరేకల్ లో 20 ,కొత్తూరు లో 12 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం చాలామంది నాయకులూ ఉన్న టీఆర్ యస్ అభ్యర్థుల ఎంపికలోనూ ప్రచారంలో మంత్రి అజయ్ అంతా తన కను సన్నలలో జరిగేలా చూసుకున్నారు. వరంగల్ లో మాత్రం మంత్రి ఎర్రబెల్లి , కీలకంగా వ్యవహరించారు. జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్ తన వంతు పాత్ర పోషించారు. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య కొన్ని పొరపొచ్చాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందువల్లనే తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకుండా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో బీ ఫారాలు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపికపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది . ఈ నెల 30న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకే ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటం సమయం కుదించటంతో ప్రచారం కోసం అభ్యర్థులు రాజకీయపార్టీలకు ఇబ్బందులు తప్పలేదు

చివరి నిమిషంలో వచ్చిన వారికి… పార్టీ టికెట్స్ ఇవ్వడంపై అసంతృప్తులు
కొన్ని చోట్ల చివర నిమిషంలో పార్టీలోకి వచ్చిన వారికీ పార్టీ టికెట్స్ ఇవ్వడం పార్టీ లో అసంతృప్తులు బయలు దేరాయి. అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు.
కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఆయన భార్యకు టికెట్‌ ఇచ్చారు. సుదర్శన్‌గౌడ్‌తో పాటు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన ఆయన అనుచరులు ఒకరిద్దరికి టీఆర్‌ఎస్‌ తరపున కౌన్సిలర్‌ టికెట్‌ దక్కింది. జడ్చర్ల మున్సిపాలిటీలో బీజేవైఎం మహబూబ్‌నగర్‌ జిల్లా మాజీ అధ్యక్షులు రామ్మోహన్‌ భార్య సారికకు చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌ బీ ఫారం దక్కగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శోభ పోటీ నుంచి వైదొలిగారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 10వ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి ధనలక్ష్మి ఏకంగా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్లు కలిసిరాకపోవడం, పనితీరుపై వ్యతిరేకత వంటి కారణాలతో చాలాచోట్ల సిట్టింగ్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం దక్కలేదు. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలో వివిధ పార్టీల తరపున, స్వతంత్రులుగా గెలిచి తర్వాతి కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సిట్టింగ్‌లకు మళ్లీ టీఆర్‌ఎస్‌ తరపున అవకాశం దక్కింది. కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ ప్రత్యేక నిధులు గాని నాయకుల ప్రచారం కానీ పెద్దగా లేదు. ఖమ్మం లో మాత్రం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలకంగా వ్యవహరించారు. పొన్నం ప్రచారంలో పాల్గొన్నారు. నకిరేకల్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,వరంగల్ లో కొండా దంపతులు , రాజేందర్ రెడ్డి , కీలకంగా వ్యవహరించగా , జీవన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మిగతా ప్రాంతాలలో స్థానిక నేతలు పాల్గొన్నారు. బీజేపీ తరుపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ ఛుగ్ ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఎమ్మెల్యే రఘునందన్ రావు , జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వామపక్షాల నేతలు , ఇతరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని రక్తి కట్టించారు.

Leave a Reply

%d bloggers like this: