అమెరికా నో మాస్క్-బట్ వన్ కండిషన్ … వ్యాక్సిన్ తీసుకుంటే

అమెరికా నో మాస్క్-బట్ వన్ కండిషన్ … వ్యాక్సిన్ తీసుకుంటే
-ప్రకటించిన అమెరికా ప్రభుత్వం
-ఇప్పటికే ఇజ్రాయిల్ లో ,మాస్క్ అవసరంలేదన్నారు
-అక్కడ ప్రభుత్వాలు వ్యాక్సిన్ లో సెక్సెస్ అయ్యాయి
-వ్యాక్సిన్ చేసిన దేశాలలో ఇబ్బందులు తక్కువే
-భారత్ లో వాక్సినేషన్ వేగవంతంగా జరగాలి
-అప్పుడే ప్రమాదం నుంచి బయట పడగలం
కరోనా ….కరోనా …. కరోనా … మహమ్మారి కరోనా ప్రపంచాన్ని గడగడా లాడిస్తుంది.కాని కొన్ని దేశాలు ఈ మహమ్మారిపై విజయం సాధించాయి. ఇది ప్రపంచానికి తీపి కబురే … ఇక దీనికి మరణం తప్ప ఇరుగుడు లేదని ఇది వస్తే ఇంతే సంగతులని , ప్రమాదకరమైన వ్యాధి అని దీనినుంచి బయట పడాలంటే తీసుకోవలసిన మందుల గురించి , జాగ్రత్తల గురించి అనేక సలహాలు సూచనలు వచ్చాయి. జాగ్రత్తలు పాటించిన దగ్గర ఫలితాలు కూడా ఉన్నాయి . అనేక దేశాలలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. అమెరికా , రష్యా , బ్రిటన్ , జర్మనీ , జపాన్ , బ్రెజిల్ , ఫ్రాన్స్ , ఇటలీ , లాంటి అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలం అయ్యాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఉపశమనం కలిగింది . ఇప్పుడా ఆయా దేశాలలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది . ఇందుకు తగ్గ మెడిసిన్ రావడమే ఇందుకు కారణం . అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఈ మహమ్మారికి 5 లక్షల 87 వేలమంది పైగా మరిణించగా 3 కోట్ల 29 లక్షల మంది దీని భారిన పడ్డారు. అలాంటి కరోనా నుంచి బయట పడటం ప్రపంచపటం మీద ఉన్న అన్ని దేశాలకు సవాల్ గా మారింది. గత సంవత్సర కాలంగా ప్రపంచాన్ని వణికించిన కరోనా కు అనేక పరిశోధనల తరువాత వ్యాక్సిన్ కనుగొన్నారు. అనేక పేరుమోసిన ఫార్మా కంపెనీ లు నిర్వయించిన పరిశోదల ఫలితంగా వచ్చిన వ్యాక్సిన్ కొంత ప్రపంచానికి ఊరటగా మారింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మంచి ఫలితాలు కనిపించాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ అనే దేశంలో 60 శాతం ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత మాస్క్ అవసరం లేకుండ ప్రజలు గతంలో వలెనే తిరగవచ్చునని ఆ దేశం ప్రకటించింది . ఇప్పుడు అగ్రం రాజ్యం అమెరికా సైతం మాస్క్ అవసరం లేకుండానే తిరిగే అవకాశాన్ని కల్పించింది. అమెరికా లో సైతం వ్యాక్సిన్ కార్యక్రమం చురుకుగా సాగుతుంది. ఇప్పటికే 60 శాతం పైగా వ్యాక్సిన్ వేయటం పూర్తీ అయిందని అంటున్నారు. ఫైజర్, మోడర్న అనే ఫార్మ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ ఆ దేశంలో ఉన్న ప్రజలకు అందించారు. అది కూడా మూడు వారాల వ్యవధిలో సెకండ్ డోస్ కూడా ఇవ్వడం గమనార్హం .మిగతా దేశాలలో ఆస్ట్రా జనికా , మరికొన్ని దేశాలలో కోయాక్సల్ ,కోవిసివియర్ ,జాన్సన్ అండ్ జాన్సన్ , లాంటి కంపెనీలు వ్యాక్సిన్లను తయారు చేశాయి. ఇప్పుడు ప్రపంచమంతా వ్యాక్సిన్ల కోసము పరుగులు పెడుతున్నది.ఆస్ట్రా జనికా పై కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి తీసుకున్న వారిలో రక్తం గడ్డ గడుతుందని అంటున్నారు. అందుకే డెన్మార్క్ లాంటి దేశాలు ఆస్ట్రా జనికా ను పూర్తిగా నిషేధించాయి. మొదట తిరస్కరించిన కొన్ని దేశాలు తిరిగి కంపెనీ వారు దానిపై వివరణ ఇచ్చిన తరువాత తిరిగి ఆ వ్యాక్సిన్ అంగీకరించాయి. ఫైజర్ కంపెనీ టీకాలు కాకుండా టాబ్లెట్స్ తయారీలో నిమగ్నం అయినట్లు ఆ కంపెనీ ప్రకటించింది . అది అన్ని పరిశోధనల అనంతరం మార్కట్లోకి వస్తే కరోనా జాడ లేకుండా చేయవచ్చిననే ప్రచారం జరుగుతుంది.దాన్ని ఈ ఏడాది చివరినాటికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే జరిగితే ఇంతకన్నా కావాల్సింది ఏముంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండియా లో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది . రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి తెలుసుకోవచ్చు . ఆక్సీజన్ , మందుల కొరత ,బెడ్స్ కొరత తో దేశం అతలాకుతలం అవుతుంది. దీనికి తోడు కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు పెట్టడం పై విమర్శలు ఉన్నాయి. టెస్టింగ్ ,ట్రేసింగ్ ట్రీట్మెంట్ లలో అనుకున్న వేగం లేకపోవడం , మొదట సారి వచ్చిన వేవ్ తగ్గుమొఖం పట్టిన తరువాత , నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పరిస్థితులు దారుణంగా తయారైయ్యాయి . భారత్ లో వేగంగా వ్యాక్సిన్ ప్రక్రయ జరిగితే ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దానికోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి !

Leave a Reply

%d bloggers like this: