భట్టి ఆరోపణలపై మంత్రి పువ్వాడ మండిపాటు

భట్టి..వాస్తవాలు తెలియకుండా అవాక్కులు చవాక్కులు పేలకు.. మంత్రి పువ్వాడ.

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగడం లేదని పోలీస్ స్వామ్యంలో జరుగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపణల్లో వాస్తవం లేదని, వాస్తవిక పరిస్థితులు తెలుసుకోకుండా అవాక్కులు చవాక్కులు పేలితే సహించేది లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భట్టి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవంను గ్రహించిన మల్లు భట్టి విక్రమార్కా వాస్తవాలు కప్పిపుచ్చి తమపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

ఎన్నికల నియమావళిని తెరాస ఉల్లంఘించారని ఆరోపణలు చేస్తున్న భట్టి, ఎన్నికల నియమావళి ఉండగా జిల్లా కాలెక్టరేట్ లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.

ఖమ్మం నగరంలో నిన్న మీ పార్టీ అభ్యర్థులు, నాయకులు ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న విషయమై పోలీసులు మీ నాయకులను అరెస్ట్ చేస్తే తమకేం సంభంధం అని ప్రశ్నించారు. పోలీస్ లు స్వయంగా పట్టుకున్నారు కాబట్టే పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాన్ని తెరాస పార్టీపై, తనపై అభియోగాలు మోపడం భట్టికి సర్వసాధారణంగా మారిందన్నారు. మీ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా దొరికిపోయి మళ్ళీ తిరిగి తమ పైన కలెక్టర్ కు ఫిర్యాదు చేయడమెంటో అర్థం కట్లేదన్నారు.

వాస్తవాలు తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి తనకంతా తెలుసని, పార్టీ అంతర్గత విషయాలపై తాను నోరు విప్పుతే మీరు మొహం ఎక్కడ పెట్టుకోవలో కూడా తెలియదన్నారు.

ముఖ్యంగా రేపు జరిగే ఎన్నికల్లో తెరాస పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని భట్టి విక్రమార్క కొత్త నాటకానికి తెర తీసి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తూన్నారని అన్నారు.

ప్రజలు మీకు రేపు తగిన సమాధానం చప్పనున్నారని, మీ మాటలు నమ్మే రోజులు పోయాయని, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Leave a Reply

%d bloggers like this: