కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు: డాక్టర్ ఎంవీ రావు

సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు: డాక్టర్ ఎంవీ రావు
  • ఇటీవల కరోనా బారినపడిన సీఎం కేసీఆర్
  • కోలుకున్నారంటూ వార్తలు
  • ఆర్టీపీసీఆర్ టెస్టులో తేలని ఫలితం
  • వివరణ ఇచ్చిన వ్యక్తిగత వైద్యుడు
  • వైరస్ తగ్గే క్రమంలో ఒక్కోసారి సరైన ఫలితాలు రావని వెల్లడి
Dr MV Rao tells CM KCR health details

సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారన్న వార్తలపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు వివరణ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో సరైన ఫలితం రాకపోవడంపై ఆయన స్పందిస్తూ… నిన్న నిర్వహించిన యాంటీజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కు నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఆర్టీపీసీఆర్ టెస్టులో కచ్చితమైన ఫలితం రాలేదని తెలిపారు.

వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని డాక్టర్ ఎంవీ రావు అభిప్రాయపడ్డారు. సీఎం ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు మూడు రోజుల్లో ఆయనకు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు.

Leave a Reply

%d bloggers like this: