కూకట్ పల్లి ఏటీఎం దోపిడీదారులను అరెస్ట్ చేసిన పోలీసులు

కూకట్ పల్లి ఏటీఎం దోపిడీదారులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • హైదరాబాదులో హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం వద్ద కాల్పులు
  • సెక్యూరిటీ గార్డు మృతి
  • రూ.5 లక్షల నగదుతో దొంగల పరారీ
  • సంగారెడ్డి వద్ద అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు
SOT Police arrests ATM robbers at Sangareddy

హైదరాబాదులో హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం వద్ద కాల్పులకు పాల్పడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం కూకట్ పల్లిలో ఏటీఎం వద్ద కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదుతో బైక్ పై పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు అలీ ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనను సవాల్ గా తీసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే దోపిడీదారులను పట్టుకున్నారు. సంగారెడ్డి వద్ద వారిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల క్రితం జీడిమెట్లలో బ్యాంకు దోపిడీకి పాల్పడింది వీరి ముఠానే అని పోలీసులు గుర్తించారు.

Leave a Reply

%d bloggers like this: