Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ శాతం

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ శాతం
– తగ్గిన పోలింగ్ శాతం 2016 ఎన్నికల్లో 67 .68 ఈ సారి 58 శాతం పెరిగే ఆవకాశం
-కరోనా ప్రభావమే కారణం మంటున్న అధికారులు
-చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం
-దొంగ ఓట్ల ఆరోపణలు -57 డివిజన్లో ఉద్రిక్తత పోలిసుల జోక్యం
-ఓట్లు హక్కు వినియోగించుకున్న మంత్రి , నామ,కలెక్టర్
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా మొత్తం మీద పోలింగు ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ సారి పోలింగ్ అనూహ్యంగా తగ్గటంపై ఆందోళనలు నెలకొన్నాయి. 2016 లో జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో 67 .68 శాతం పోలింగు నమోదు కాగా , ఈ సారి ఓటింగు శాతం తగ్గింది. సాయంత్రం 5 గంటలకు అందిన సమాచారం మేరకు కేవలం 58 శతం మాత్రమే నమోదు అయింది. ఫైనల్ లెక్కలు వచ్చే సరికి దీనికి కొంత శాతం పెరగవచ్చు. ఓటింగ్ శాతం తగ్గుదలకు కారణం కరోనా భయం అయి ఉండవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోలింగు సందర్భంగా చిన్న చిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దొగ్గవోట్ల పై అక్కడక్కడా ఫిర్యదులు వచ్చాయి. అధికార టీఆర్ యస్ దొంగ ఓట్లను వేయిస్తుందని కాంగ్రెస్ ,సిపిఎం ,బీజేపీ పార్టీలు ఆరోపించాయి.

57 డివిజలోని ఎన్సీపీ క్యాంపు పరిధిలోని పోలింగ్ భూతు వద్ద దొంగఓట్లు వేయిస్తున్నారంటూ టీఆర్ యస్ పై కాంగ్రెస్ అభ్యర్థి భర్త వాగ్వివాదానికి దిగారు దీనితో అక్కడ ఉద్రికత్త ఏర్పడింది. అక్కడకు చేరుకున్న డి సి పి సుభాష్ చంద్రబోస్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అభ్యర్తగా పోటీచేస్తున్న అభ్యర్థి భర్త ముస్తఫా ఆధ్వరంలో దొంగ ఓట్లకు నిరసనగా రోడ్డుపై బైఠాయించడంతో ముస్తఫా ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ని విడుదల చేయాలనీ కిరోసిన్ పోసుకొని రోడ్ పై బైఠాయించారు. వారికీ పోలీసులు సర్ది చెప్పారు. పి జి కళాశాలలోగల 55 డివిజన్లో దొంగ ఓట్ల విషయంలో జరిగిన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. పోట్ల వీరేందర్ , మోతరపు సుధాకర్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అరుపులు కేకలు చోటుచేసుకున్నాయి. సత్తుపల్లి ఏ సి పి వెంకటేష్ సకాలంలో జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది . 43 డివిజన్లో కూడా అధికార టీఆర్ యస్ పార్టీ వాళ్ళు సెల్ఫోన్లు పోలింగ్ భూతుల్లోకి తీసుకొని పోతున్నారని అభియోగాలతో ఉద్రికత్త చోటు చేసుకొన్నది.

 

Related posts

ఐజేయి సమావేశాలకు ఆంధ్ర,తెలంగాణ ప్రతినిధులు…

Drukpadam

ఈఎస్ఐ స్కాంలో రూ.144 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ!

Drukpadam

అడవి శేష్ కు మామిడికాయలు పంపించిన ప్రకాశ్ రాజ్….

Drukpadam

Leave a Comment