Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముంబయిలో మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపివేత!

ముంబయిలో మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపివేత!
  • రిజిస్ట్రేషన్లు కూడా బంద్‌
  • ప్రకటించిన బీఎంసీ అధికార వర్గాలు
  • టీకాల కొరతే కారణం
  • అందుబాటులోకి రాగానే తెలియజేస్తామని వెల్లడి
  • మూడో విడత వ్యాక్సినేషన్‌పైనా నీలినీడలు
No vaccination in mumbai for 3 days

ముంబయిలో వ్యాక్సిన్ల కొరత ఇంకా వేధిస్తోంది. రాబోయే మూడు రోజుల పాటు టీకాలు లేని కారణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలిపివేయనున్నట్లు బృహత్‌ ముంబయి పాలకవర్గం(బీఎంసీ) ప్రకటించినట్లు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్లు సైతం స్వీకరించేది లేదని వెల్లడించింది. వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే మేసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

ముంబయిలోని బీకేజీ వ్యాక్సినేషన్‌ కేంద్ర వద్ద గురువారం భారీ స్థాయిలో ప్రజలు టీకా కోసం వరుసల్లో నిలబడ్డారు. ఉదయం 8:30 గంటల వరకు అసలు టీకా చేరకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. చివరకు 9 గంటల సమయంలో ఐదు వేల డోసులు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ వారం ఆరంభంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించినట్లుగా మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించడం కష్టతరమని తెలిపారు. సరిపడా వ్యాక్సిన్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts

ప్రభుత్వ అధికారులకు విద్యుత్ వాహనాలను అందిస్తాం: గడ్కరీ

Drukpadam

ఏపీ వ్యాప్తంగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల ఆందోళ‌న‌లు…

Drukpadam

వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment