పరీక్షలు నిర్వహించేందుకే ఏపీ సర్కార్ మొగ్గు…

పరీక్షలు నిర్వహించేందుకే ఏపీ సర్కార్ మొగ్గు…
-విద్యార్థులు భవిషత్ కోసమే అంటున్న సీఎం జగన్
ఏ పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తున్నామో అందరికీ అర్థం కావాలి: జగన్
పాస్ మార్కులు మాత్రమే వస్తే మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయి?
విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నాం
పరీక్షల నిర్వహణకు అందరి సహకారం కావాలి

ప్రతిపక్షాలు వద్దు వద్దు అంటున్న కోర్టులు ఆలోచించాలని చెప్పిన ఏపీ సర్కార్ ఇంటర్ పరీక్షలను జరపాలని నిర్ణయించింది . ఇది విద్యార్థులు కోసమే అంటున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .కనీస మార్కులు రాకూండా పాస్ చేయడం చాల తేలిక కానీ ఆవిధంగా చేస్తే విద్యార్థులు నష్టం జరుగుతుంది అని అన్నారు. పరీక్షలు రద్దు చేయడం చాల తేలిక ,నిర్వించటమే చాల కష్టం అని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులను మాత్రమే ఇస్తున్నాయని చెప్పారు. కేవలం పాస్ మార్కులు మాత్రమే వస్తే వారికి మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పరీక్షల్లో 70 శాతానికి పైగా మార్కులు వస్తేనే మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయని తెలిపారు. పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షతోనే పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

పరీక్షల నిర్వహణ వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ తెలియజేయాలని జగన్ చెప్పారు. కేరళలో నిన్ననే పదో తరగతి పరీక్లలు పూర్తయ్యాయని తెలిపారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదని చెప్పారు. నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసిందని తెలిపారు. పరీక్షలను రద్దు చేయడం చాలా సులభమని… నిర్వహణ చాలా బాధ్యతతో కూడుకున్నదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు, అధ్యాపకులు గుర్తించాలని అన్నారు. పరీక్షల నిర్వహణకు అందరి సహకారం కావాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో పరీక్షలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: