Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

రాష్ట్రంలో కొన్ని వారాలైనా లాక్ డౌన్ పెట్టాలి…సీఎల్పీ నేత భట్టి

రాష్ట్రంలో కొన్ని వారాలైనా లాక్ డౌన్ పెట్టాలి…సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

  • సెకెండ్ వేవ్ పెద్ద విపత్తు
  • ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులు ఏర్పాటు చేయాలి
  • వెంటిలేటర్లను తక్షణం ఏర్పాటు చేయాలి
  • మందులున్న ఆసుపత్రుల్లో బెడ్స్ ఉండడం లేదు
  • బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో మందులు ఉండడం లేదు

రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉందని.. కొన్ని వారాలైనా లాక్ డౌన్ పెట్టి ప్రజలను కాపాడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు జూమ్ మాధ్యమం ద్వారా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కరోనాపై కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో కరోనా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కరోనా పరిస్థితులతపై ఏడాది కిందటే దేశ స్థాయిలో రాహుల్ గాంధీగారు, రాష్ట్ర అసెంబ్లీలో సీఎల్పీ నాయకత్వం తీవ్రంగా హెచ్చరించినట్లు చెప్పారు. సెకెండ్ వేవ్ అనేది పెద్ద విపత్తు.. దీనినినుంచి ప్రజలను రక్షించుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజలను కాపాడుకోలేమని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వాన్ని హెచ్చరించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన తీరు.. నేడు రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణమైందని అన్నారు. సంవత్సర కాలం సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఆసుపత్రుల్లో కావాల్సిన ఆక్సిజన్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోకపోవడం దుర్మార్గమని భట్టి అన్నారు. ఆసుపత్రుల్లో ఇవ్వాల బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్, మందులు లేక చాలామంది మరణిస్తున్నారని అన్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల కరోనా రోగులు.. వారి బంధులు చేతుల్లోనే మరణిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేకపోవడం వల్ల డాక్టర్ల కళ్ల ముందే కరోనా బాధితులు కళ్లుమూస్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భట్టి ఆగ్రహంగా చెప్పారు. ఏడాది కిందటే సెకెండ్ వేవ్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గతానుభవాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన బెడ్స్, ఆక్సిజన్ వ్యవస్థను, అవసరమైన వెంటిలేటర్లను, మందులను, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఉంటే రాష్ట్రం నేడు ఇంత భయానక పరిస్థితుల్లో ఉండేది కాదని భట్టి చెప్పారు.

ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన అన్ని అంశాలను పక్కన పెట్టి.. మొదట ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమే అన్ని చర్యలు తసీుకోవాలి.. వనరులను దీనికే చేయాలని అన్నారు . దురద్రుష్టం ఏమిటంటే.. దీనిని మానిటర్ చేసేందుకు సచివాలయం కూడా లేకుండా చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నయి. కనీసం సచివాలయం ఉంటే అక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఇతర ఉన్నతాధికారులు యుద్దప్రాతిపదికన మానిటర్ చేసుంటే కొంతలో కొంతయినా ప్రజలను కాపాడుకునేవాళ్లం.. సచివాలయం లేకుండా ప్రధానకార్యదర్శి ఎక్కడ కూచుంటారో తెలియకుండా.. మంత్రివర్గం కూర్చుని సమస్యపై పోరాటం చేసేందుకు అవసరమైన వ్యవస్థీక్రుత వ్యవస్థ లేకపోవడం మరో కారణమని భట్టి అన్నారు. దీనివల్ల పాలనాయంత్రాంగం మొత్తం కూలిపోయింది. ఈ కారణం వల్లే మానిటరింగ్ వ్యవస్థే లేకుండా పోయిందని భట్టి అన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెల్త్ అండ్ మెడికల్ కార్యదర్శి ఎవరికీ అందుబాటులోకి రారని భట్టి చెప్పారు. మిగిలిన శాఖల మధ్య సమన్వం లేదన్నారు. ఆసుపత్రుల్లో మందులు ఉన్న చోట బెడ్స్ ఖాళీగా ఉండడం లేదు.. బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో మందులు దొరకడం లేదని భట్టి చెప్పారు. చివరకు రోగి చనిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని అన్నారు. రోగులు హాహాకారాలతో తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్య, ఆరోగ్య శాఖామంత్రి చెబితే కింది యంత్రాంగం కదిలే పరిస్థితి లేదన్నారు. మొత్తం వ్యవస్థను పడుకోబెట్టిన కేసీఆర్.. చివరకు ఆయన కూడా కరోనాతో పడుకున్నారని భట్టి అన్నారు. ఏదేమైనా కరోనా బారిన పడ్డ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భట్టి ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి భయానకంగా ఉందని అన్నారు. ఎన్నికలు, ఓట్లపైన ఉన్న ఆలోచన, ద్రుష్టి ప్రజారోగ్యం మీద కేసీఆర్ కు లేదని బట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. నాగార్జున సాగర్ లో భారీ బహిరంగ సభలు పెట్టి రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమయ్యారని భట్టి అన్నారు. ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై చేసే మానిటరింగ్.. ప్రజారోగ్యం మీద పెట్టివుంటే కొద్దిగానైనా ప్రజలు సురక్షితంగా ఉండేవారని అన్నారు.

గతంలో రాష్ట్రమంతటా అన్ని ఆసుపత్రులు పర్యటించి అక్కడున్న వాస్తవ పరిస్థితులు, ఖాళీలు, బెడ్స్ వసతులు వంటి అన్ని అంశాలపై సమగ్ర సమాచారాన్ని స్పీకర్ ద్వారా ముఖ్యమంత్రికి పంపాను. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చమని నిండు సభలో అడిగాను.. ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా బాధితులు వెళితే లక్షల్లో బిల్లులు వేసి లూటీ చేస్తున్నారని చెప్పాను.. వీటిన కంట్రోల్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ వేయమని ముఖ్యమంత్రికి చెప్పాను.. 24 గంటల్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆ టాస్క్ పోర్స్ సభ్యులు ఏ ఆసుపత్రిని కంట్రోల్ చేస్తున్నారో ఇంతవరకూ అర్థం కావడం లేదని భట్టి అన్నారు.

పాలకులుగా ముందు ప్రజల ప్రాణాలు కాపాడడం మన బాధ్యత. రాష్ట్రంలో ఉన్న అన్ని పనులను పక్కన పెట్టి.. అన్ని శాఖలకు ఖర్చు పెట్టే వనరులను ఆపి.. వాటిని మొత్తాన్ని ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ఖర్చు పెట్టాలని భట్టి సూచించారు. సీతక్క, వెంకట్ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని భట్టి చెప్పారు.
కరోనాతో రాష్ట్రంలో మరణాల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదు.. వాస్తవ మరణాల్లో ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే చూపుతోందని భట్టి చెప్పారు. ఢిల్లీ లాంటి పరిస్థితులు మన రాష్ట్రానికి, నగరాలకు రాకుందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్ చేశారు. కొద్ది వారాలైనా లాక్ డౌన్ ప్రకటించి.. లాక్ డౌన్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని భట్టి డిమాండ్ చేశారు. మీడియా జర్నలిస్టులకు, పాత్రికేయులకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద గుర్తించి.. వారికి కరోనా వ్యాక్సిన్ అందించాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts

సభ నిర్వాణం తీరుపై సీఎం ,స్పీకర్ , శాశనసభ వ్యవహారాల మంత్రి లేఖ రాస్తా …భట్టి

Drukpadam

మరోసారి తెరపైకి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ …సండ్ర వెంకటవీరయ్య పేరు ప్రస్తావన!

Drukpadam

రాహుల్ గాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించండి: బీజేపీ

Drukpadam

Leave a Comment