Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో కరోనా విలయతాండవం
ఈ నెల 5 నుంచి పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధం
హైకోర్టుకు చేరిన పరీక్షల వ్యవహారం
హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు
పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించిన మంత్రి ఆదిమూలం

ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. వాస్తవానికి, ఏపీ ప్రభుత్వం ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. అయితే, చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు.

Related posts

పూరి ఆలయంలో స్మార్ట్‌ఫోన్లపై పూర్తి నిషేధం.. జనవరి 1 నుంచే అమలు!

Drukpadam

ఇక షావోమీ చౌక కార్లు..! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు…

Drukpadam

టర్కీ, సిరియాలో భూకంపం.. 640కి పెరిగిన మృతుల సంఖ్య!

Drukpadam

Leave a Comment