సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థినోముల భగత్ 19 281 ఓట్ల మెజార్టీ తో విజయం

సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థినోముల భగత్ 19 281 ఓట్ల మెజార్టీ తో విజయం
-డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
-కాంగ్రెస్ ఆశలు గల్లంతు
-పకడ్బందీ వ్యూహముతో సీటు దక్కించుకున్నటీఆర్ యస్

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన జానారెడ్డిపై విజయం సాధించారు. నోముల భగత్ 19,281 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ కి ఇక్కడ డిపాజిట్ రాలేదు . కాంగ్రెస్ ఈ సీటుపై పెద్ద ఆశలు పెట్టుకొని కురువృద్ధుడు జానారెడ్డి పోటీకి ఆశక్తి చూపనప్పటికీ పార్టీ హైకమాండ్ పెద్దలు ఆయన్ను ఒప్పించి మరి పోటీలో నిలిపారు. అయనప్పటికీ వారిపాచిక పారలేదు . టీఆర్ యస్ దుబ్బాక ,హైద్రాబాద్ ఎన్నికల తరువాత అక్కడ తగిలిన ఎదురుదెబ్బలతో సాగర్ లో పకడ్బందు వ్యూహంతో ఫలితాన్ని సాధించారు. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా 9 రౌండ్ల వరకు భగత్ దూకుడు కొనసాగింది. అయితే ఆ తర్వాత అనూహ్యరీతిలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మూడు రౌండ్ల పాటు జోరు ప్రదర్శించారు. కానీ అది తాత్కాలికమే అయింది. మిగిలిన రౌండ్లలో భగత్ మళ్లీ పుంజుకోవడంతో గులాబీ దండు మురిసింది. నాగార్జున సాగర్ లో సిట్టింగ్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న పోలింగ్ జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికలో బీజేపీ దరిదాపుల్లో లేకుండా పోయింది.

Leave a Reply

%d bloggers like this: