ఖమ్మంలో కార్పోరేషన్ లో బీజేపీ బోణి

 

ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో తొలిరౌండ్ ఫలితాల్లో 5 టీఆర్ యస్ ,2 సిపిఐ కాంగ్రెస్, సిపిఎం ,బిజేపి ఒక్కొక్క డివిజన్ చొప్పున గెలుచుకున్నాయి. ఖమ్మం చరిత్రలో బీజేపీ గెలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టింది. 7 వ డివిజన్ నుంచి బీజేపీ కార్పోరేటర్ గా పోటిచేసిన దొంగల సత్యనారాయణ విజయం సాదించారు . 1 డివిజన్ నుంచి టీఆర్ యస్ కు చెందిన తెజావత్ హుస్సేన్ 13 డివిజన్ నుంచి కొత్తపల్లి నీరజ .25 డివిజన్ గోళ్ళ చంద్రకళ, 19 డివిజన్ సిపిఐ కి చెందిన చామకూరి వెంకన్న 31 వ డివిజన్ సిపి ఎం కు చెందిన యర్రా గోపి , 43 వ డివిజన్ సిపిఐ బి జి క్లైమెంట్ , 37 వ డివిజన్ నుంచి టీఆర్ యస్ కు చెందిన ఫాతిమా, 55. వ డివిజన్ నుంచి కాంగ్రెస్ కు చెందిన మోతారపు శ్రావణి లు విజయం సాదించారు . మరో 50 డివిజన్ల ఫలితాలు రావల్సి ఉంది.

Leave a Reply

%d bloggers like this: