Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ వి.కల్యాణం మృతి

మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ వి.కల్యాణం మృతి
  • నాలుగేళ్ల పాటు గాంధీతో కలిసున్న కల్యాణం
  • గాంధీ హత్య సమయంలో కూడా అక్కడే ఉన్న పీఎస్
  • కల్యాణం వయసు 99 సంవత్సరాలు
Mahatma Gandhis last personal secretary V Kalyanam dies in Chennai

జాతిపిత మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ వి.కల్యాణం ఈరోజు తుదిశ్వాస విడిచారు. వయసుకు సంబంధించిన కారణాలతో ఆయన చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. మధ్యాహ్నం 3.30 గంటలకు కల్యాణం మృతి చెందినట్టు ఆయన కుమార్తె నళిని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు బసంత్ నగర్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

1922 ఆగస్ట్ 15న సిమ్లాలో కల్యాణం జన్మించారు. 1944 నుంచి 1948 వరకు గాంధీతో ఆయన కలిసి ఉన్నారని బయోగ్రాఫర్ కుమారి ఎస్ నీలకందన్ తెలిపారు. మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో కల్యాణం ఉన్నారని…. గాంధీకి వివిధ భాషల్లో వచ్చే లేఖల వ్యవహారాలను ఆయన చూసేవారని చెప్పారు. నాలుగేళ్ల పాటు గాంధీకి ఆయన సేవలందించారని తెలిపారు. 1948 జనవరి 30న ఢిల్లీలో మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు కూడా కల్యాణం అక్కడే ఉన్నారని చెప్పారు.

Related posts

వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

రాత్రికి రాత్రే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచలేం: అదర్ పూనావాలా

Drukpadam

బిలియనీర్‌ జార్జ్ సోరోస్‌పై విదేశాంగ మంత్రి జయశంకర్ తిట్ల దండకం !

Drukpadam

Leave a Comment