Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడి అరెస్ట్!

కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడి అరెస్ట్!
  • ఈటల రాజేందర్ ను తొలగించడంపై యువకుడి అసంతృప్తి
  • యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు యువకుడి అరెస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మాలకుంటకు చెందిన ధరావత్ శ్రీను నాయక్ అనే యువకుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తొలగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోపై ధర్మాపురం గ్రామ సర్పంచ్ నగేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు, శ్రీను నాయక్ ను అరెస్ట్ చేయడంపై లంబాడీ విద్యార్థి సేన ఆందోళన చేపట్టింది. శ్రీనును విడుదల చేయాలంటూ సూర్యాపేట రూరల్ సీఐకి వినతిపత్రం అందించారు.

Related posts

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం!

Drukpadam

గీతం యూనివర్సిటీ 40 ఎకరాలు ఆక్రమించుకున్నట్టు రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు​: పంచుమర్తి అనురాధ

Ram Narayana

ప్రజాభీష్టం మేరకే కాంగ్రెసులోకి …మాజీఎంపీ పొంగులేటి…!

Drukpadam

Leave a Comment