Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పూరి గుడిసె నుండి తమిళనాడు అసెంబ్లీకి!

పూరి గుడిసె నుండి తమిళనాడు అసెంబ్లీకి!

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గుడిసెలో నివాసం ఉండే సీపీఐ పార్టీ అభ్యర్థి కే మారిముత్తు.. కోటీశ్వరుడైన ఏఐఏడీఎంకే అభ్యర్థి సురేష్ కుమార్‌పై ఘన విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కడువకూడి గ్రామంలో నివాసం ఉండే మారిముత్తు.. ఎల్పీజీ గ్యాస్ ధర భరించలేక, కిరోసిన్ స్టవ్‌పైనే ఆధారపడి ఆయన కుటుంబం జీవిస్తోంది.

అన్నాడీఎంకే అభ్యర్థిపై మారిముత్తు భారీ విజయం

డీఎంకే నేతృత్వంలోని సెక్యూలర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ కూటమి తరపున మారిముత్తు తిరుత్తురైపూండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అన్నాడీఎంకే అభ్యర్థిపై విజయం సాధించారు.

సురేష్ కుమార్‌పై 29,102 ఓట్లతో మారిముత్తు గెలిపొందారు. మారిముత్తుకు 95,785 ఓట్లు రాగా, ఏఐఏడీఎంకే అభ్యర్థి సురేష్ కుమార్‌కు 66,683 ఓట్లు వచ్చాయి.

మారిముత్తు నిజమైన కామ్రేడ్

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన సొంత పార్టీ అభ్యర్థులు కొందరు కోట్లలో ఆస్తున్నట్లు ప్రకటించగా.. మారిముత్తు మాత్రం తన వద్ద 75 సెంట్ల భూమి, 3వేల నగదు, రూ. 58,156 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు ప్రకటంచారు. తన భార్య పేరున రూ. 79,304 విలువైన ఆస్తులున్నాయని తెలిపారు. కాగా, మారిముత్తు నిజమైన కామ్రేడ్ అని స్థానికులు అంటున్నారు. 1994 నుంచి ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉంటున్నారు. గతంలో సైక్లోన్ గజా కారణంగా తన గుడిసె కూలిపోగా.. ఓ ఎన్జీవో రూ. 50వేలు సాయం చేసింది. అయితే, ఆ మొత్తాన్ని తుఫానులో సర్వస్వం కోల్పోయిన మరో పేద వ్యక్తికి అందించారు మారిముత్తు.

ప్రజా ఉద్యమాల్లో మారిముత్తు..
తాను గెలిస్తే.. వ్యవసాయ భూములకు రక్షణ కల్పిస్తామని, నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎన్నికల ముందు మారిముత్తు ప్రజలకు హామి ఇచ్చారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్ట్ తోపాటు చాలా ఉద్యమాల్లో మారిముత్తు చురుకుగా పాల్గొన్నారు. సీపీఐ కొత్తూరు యూనియన్ సెక్రటరీగా ఆయన దశాబ్ద కాలంగా పనిచేశారు. తిరుత్తురైపూండి నియోజకవర్గం 1971 నుంచి కూడా సీపీఐకి కంచుకోటలా ఉంటూ వస్తోంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నూతన తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణం చేయనున్నారు.

Related posts

కేటీఆర్.. నువ్వే కొత్త బిచ్చగాడివి: మధు యాష్కి ఫైర్!

Drukpadam

పాలేరు ఓటమిపై రగిలి పోతున్న తుమ్మల …

Drukpadam

రేవంత్ కన్నీరు పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు …

Drukpadam

Leave a Comment