Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెను తుఫానుగా మారిన యాస్ :బెంగాల్ ,ఒడిశా లలో వణికి పోతున్న ప్రజలు…

పెను తుఫానుగా మారిన యాస్ :బెంగాల్ ,ఒడిశా లలో వణికి పోతున్న ప్రజలు…
-కోట్లలో ఆస్తినష్టం :సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం
-బెంగాల్‌లో 9 లక్షల మంది, ఒడిశాలో 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు,
-భారీ వర్షాలు, ఈదురు గాలులు -ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణాలో తుఫాన్ తాకిడి
యాస్ తుఫాన్ పెనుతుఫానుగా మారింది. బెంగాల్ ,ఒడిశా రాష్ట్రాల ప్రజలను వణికిస్తుంది. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. రెండు రాష్ట్రాలలో ఇప్పటికే 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటుంది. ఈ యాస్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఉంది ఈదురు గాలులు , వర్షలు కురుస్తాయి .
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరవాయువ్య దిశగా కదులుతున్న యాస్ తుఫాను ఒడిశాలోని పారాదీప్‌కు 220 కిలోమీటర్ల దూరంలో, బాలాసోర్‌కు ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో పశ్చిమబెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయదిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందన్నారు. యాస్ తుఫాను బుధవారం ఉత్తర ఒడిశా-బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. సహాయక బృందాలను పంపింది.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 9 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక యాస్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు, యానం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఈ ప్రాంతాల్లో 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణకోస్తాంధ్రాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Related posts

అది మ‌న సంస్కృతి కాదు.. చిన‌జీయ‌ర్ వివాదంపై జేపీ వ్యాఖ్య‌

Drukpadam

కైలాస దేశం ఎక్కడా లేదు… అసలు విషయం ఇదే!

Drukpadam

కూ యాప్ లో ఖాతా తెరిచిన సీఎం జగన్!

Drukpadam

Leave a Comment