Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెరిగిన మంత్రి హరీష్ రావు ప్రాధాన్యత….

పెరిగిన మంత్రి  హరీష్ రావు ప్రాధాన్యత…..
-ఈటల భర్తరఫ్ తరువాత వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలు
-హుజురాబాద్ ఇంచార్జి గా భాద్యతలు
-అంతకుముంది దుబ్బాక ఉప ఎన్నిక ఇంచార్జి

తన్నీరు హరీష్ రావు జగమెరిగిన బ్రాహ్మణుడు …. రాష్ట్ర మంత్రి … టీఆర్ యస్ పార్టీ లో సీనియర్…. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి కేసీఆర్ కు కుడిభుజంగా వ్యవహరించారు….. అనేక వ్యూహాలకు ఎత్తుగడలకు ఆయనే కారణం అని ఉద్యమకారులు చెబుతుంటారు…… ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయానా మేనల్లుడు ….. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారు…… కేసీఆర్ ఆశీస్సులతో సిద్ధిపేట నుంచి వరసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న నేత ….ఉద్యమకాలంలో కీలంగా వ్యవహరించి ఉద్యమకారుల మనస్సులు చూరగొన్న నేతగా ఆయన కు మంచి పేరుంది…… కానీ తరువాత కాలంలో హరీష్ రావు కు పార్టీలోనూ ,ప్రభుత్వంలో క్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది…… కారణాలు ఏమైనా మామ అల్లుళ్ల మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరిగింది….. ట్రబుల్ షూటర్ గా అనేక క్లిష్ట పరిస్థితులను చక్కబెట్టడంలో దిట్టగా పేరున్న హరీష్ రావు సేవలు సీఎం కేసీఆర్ సరిగా ఉపయోగించుకోవడం లేదనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి……ఎవరు అవునన్నా కాదన్నా కొంత కాలం ఆయన్ను కేసీఆర్ దూరం పెట్టారనేది వాస్తవం …. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. … మంత్రులు ,ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ అభినందళాలు తెలుపుతూ ఈ ప్రచారానికి ఊతం ఇచ్చారు. పార్టీలో సీనియర్ గా ఉన్న హరీష్ రావు ను కాదని కేటీఆర్ కు సీఎం పీఠం ఇస్తన్నారనే ప్రచారంతో హరీష్ రావు కు అన్యాయం జరుగుతుందనే భావన సామాన్య ప్రజల్లో ఏర్పడింది. కేటీఆర్ సీఎం కాబోతున్నారని ప్రచారం జరుగుతున్న సందర్భంలో హరీష్ రావు సైతం ఎవరు సీఎం అయిన కేసీఆర్ చెప్పినట్లు నడుచుకుంటానని తనకు ఏ భాద్యత అప్పగించిన చేస్తానని చెప్పడం కొందరికి ఇష్టం లేకున్నా ఆయన పరిపక్వతతో వ్యవహరించారని పరిశీలకుల అభిప్రాయం.
కేసీఆర్ రెండవసారి 2018 లో అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ మంత్రి వర్గంలోకి వెంటనే హరీష్ రావు కు చోటు కల్పించలేదు …. హరీష్ రావు తో పాటు కేటీఆర్ కూడా మంత్రి వర్గంలో చోటు దక్కలేదు . అయితే కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమించారు. దీంతో పార్టీ బాధ్యతల్లో ఉన్న కేటీఆర్ రాష్ట్ర నాయకుడిగా అన్ని జిల్లాలపై పట్టు సాదించేందుకు అవకాశం ఏర్పడింది. కానీ హరీష్ రావు మాత్రం రాష్ట్రం లో ఎక్కడికి వెళ్లకుండా ఎలాంటి భాద్యతలు లేకుండా కట్టి పడేశారని ఇది హరీష్ రావు కు జరుగుతున్నా అన్యాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. ఇదే విషయం పలువురు పలు సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.

పార్టీ నుంచి బయటకు వెళుతున్న సందర్భగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల సైతం హరీష్ రావు కు అవమానం జరిగిన సందర్బాలు ఉన్నాయని పేరుకొన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ హరీష్ రావు కు అవమానం జరిగిన విషయం ప్రస్తావించారు. దీన్ని హరీష్ రావు స్వయంగా ఖండించారు. మాటిమాటికి తనపేరు ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు గురువు ,మార్గదర్శి ,తండ్రి సమానులు కేసీఆర్ నే అని తాను బ్రతికున్నంతకాలం పార్టీకి విధేయుడిగా ఉంటానని ప్రకటించారు. అపర చాణిక్యుడిగా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి హరీష్ రావు ను లైన్ లో పెట్టరారు . దీంతో
హరీష్ రావు కు ప్రస్తుతం పార్టీ లోను ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత పెరుగుతుంది . ఈటలను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేసిన తరువాత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆశాఖను ముఖ్యమంత్రి తన దగ్గరే అట్టి పెట్టుకున్నారు. కానీ ఎక్కువగా దాని వ్యవహారాలు ఆర్థిక మంత్రిగా కీలక పోర్ట్ పోలియో నిర్వహిస్తున్న హరీష్ రావు కు అప్పగించారు. కేంద్ర మంత్రి తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సైతం హరీష్ రావు పాల్గొన్నారు. సీఎం గాంధీ హాస్పటల్ సందర్శనలో హరీష్ రావు వెంట ఉన్నారు . తాజాగా వైద్య ఆరోగ్య విషయాలపై అధ్యనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రి ఉపసంఘానికి హరీష్ రావు నేతృత్యం వహించనున్నట్లు ప్రకటించారు. పార్టీలోనూ ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. దుబ్బాక ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం హుజురాబాద్ లో పార్టీని నిలబెట్టే పని భాద్యతలు ఆయనకే అప్పగించారు. ఒకప్పుడు తిరుగులేని నాయకుడుగా తెలంగాణ ప్రజల మనస్సుల్లో ముద్ర వేసుకున్న హరీష్ రావు మధ్యలో కొంత కాలం తెరవెనక ఉండి ఇప్పుడు మల్లి తెరముందుకు వస్తున్నారు. హరీష్ రావు ప్రాధాన్యత ఇటు ప్రభుత్వంలోనూ పార్టీలో పెరగడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

మిస్టర్ కేటీఆర్… నీ అధికారం, అక్రమ సంపాదన శాశ్వతం కాదని తెలుసుకో: కోమటిరెడ్డి…

Drukpadam

బెంగాల్‌లో మాత్రం దీదీదే హవా: ప్రశాంత్‌ కిశోర్‌

Drukpadam

ఏపీలో వైసీపీ ,టీడీపీ మధ్య అయ్యన్న ఇంటి గోడ పంచాయతీ!

Drukpadam

Leave a Comment