తిరుమల కొండపై భక్తులకు శుభవార్త -గదుల కేటాయింపుకు రిజిస్ట్రేషన్…

తిరుమల కొండపై భక్తులకు శుభవార్త -గదుల కేటాయింపుకు రిజిస్ట్రేషన్
– గదుల కేటాయింపులను మరింత సులభతరం చేసిన టీటీడీ
-6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు
-పేర్లు నమోదు చేసుకుంటే ఫోన్లకు సందేశం
-ఎస్ఎంఎస్ వస్తే నగదు చెల్లించి రూం పొందేలా ఏర్పాట్లు
-ఎల్లుండి రిజిస్ట్రేషన్ కేంద్రాల ప్రారంభం
తిరుమల కొండపై భక్తులకు శుభవార్త -గదుల కేటాయింపుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది . ముందుగా కేటాయించిన చోటు నుంచి పేరు నమోదు చేసుకొని వెళ్ళితే చాలు వెంటనే వారు ఫోన్ నెంబర్ కు మెస్సేజ్ వస్తుంది. దాని ఆధారంగా వారు డబ్బు చెల్లిస్తే సరిపోతుంది . ఇందుకు ఆరు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు .
తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసేందుకు టీటీడీ సరికొత్త ప్రణాళిక అమలు చేస్తోంది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీఎన్ సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ, ఎంబీసీ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను నెలకొల్పారు.

ఈ కేంద్రాల వద్ద తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ ద్వారా గదుల సమాచారం అందించనున్నారు. ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈ నెల 12న ఉదయం 8 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రారంభించనుంది.

Leave a Reply

%d bloggers like this: